లెనోవో వైబ్ కే5 vs మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 5

రూ.6,999 ధర ట్యాగ్‌తో మార్కెట్లో విడుదలైన లెనోవో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ Vibe K5 ఈ రోజు నుంచి ఓపెన్ సేల్ పై Amazon India పై లభ్యమవుతోంది. ఈ ఓపెన్ సేల్‌కు ముందు జరిగిన రెండు ప్లాష్‌ సేల్స్‌లో భాగంగా లక్షకు పైగా వైబ్ కే5 యూనిట్లు అమ్ముడైనట్లు లెనోవో ప్రకటించింది.

లెనోవో వైబ్ కే5 vs మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 5

ఇదే క్రమంలో మైక్రోమాక్స్, రూ.5,000 ధర బ్రాకెట్‌లో కాన్వాస్ ఫైర్ 5 ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. లెటెస్ట్ ఫోన్‌ల మధ్య మార్కెట్లో టఫ్ కాంపీటిషన్ నడుస్తోన్న నేపథ్యంలో ఈ రెండు హ్యాండ్‌సెట్‌లకు సంబంధించి
Spec comparisonను ఇప్పుడు చూద్దాం...

Read More : ఫోన్ మాట్లాడుతూనే నెంబర్ సేవ్ చేయటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో వైబ్ కే5 vs మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 5

లెనోవో వైబ్ కే5, 5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లేతో వస్తోంది. పిక్సల్ డెన్సిటీ వచ్చేసరికి 294 ppi. మరో వైపు మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 5, 5.5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ డిస్‌ప్లేతో వస్తోంది. పిక్సల్ డెన్సిటీ వచ్చేసరికి 267 ppi. ఈ రెండు ఫోన్‌లు ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానల్స్‌తో వస్తున్నాయి.

 

లెనోవో వైబ్ కే5 vs మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 5

లెనోవో వైబ్ కే5 ఫోన్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌‌‍లను పరిశీలించినట్లయితే... ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్‌, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్. మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 5, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌‌‍లను పరిశీలించినట్లయితే... క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6580 ప్రాసెసర్, మాలీ - 400 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్.

 

లెనోవో వైబ్ కే5 vs మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 5

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు 16జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తున్నాయి.

లెనోవో వైబ్ కే5 vs మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 5

మైక్రమాక్స్ కాన్వాస్ ఫైర్ 5 ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుండగా, లెనోవో వైబ్ కే5, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది.

 

లెనోవో వైబ్ కే5 vs మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 5

లెనోవో వైబ్ కే5 ఫోన్ కెమెరా ప్రత్యేకతలు... 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, హెచ్‌డీఆర్ మోడ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 5 ఫోన్ ప్రత్యేకతలు... 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

లెనోవో వైబ్ కే5 vs మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 5

లెనోవో వైబ్ కే5 ఫోన్.. 2,750 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. కంపెనీ చెబుతోన్న దాని ప్రకారం బ్యాటరీ సామర్థ్యం (322 గంటల స్టాండర్డ్ టైమ్, 15 గంటల టాక్‌ టైమ్).

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్..5, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. కంపెనీ చెబుతోన్న దాని ప్రకారం బ్యాటరీ సామర్థ్యం (450 గంటల స్టాండ్ బై టైమ్, 8.5 గంటల టాక్‌టైమ్).

 

లెనోవో వైబ్ కే5 vs మైక్రోమాక్స్ కాన్వాస్ పైర్ 5

మైక్రోమాక్స్ కాన్వాస్ ఫైర్ 5, Auro 3D soundతో కూడిన డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లతో వస్తోంది. అయితే 4జీ ఎల్టీఈ సపోర్ట్ లేదు. లెనోవో వైబ్ కే5లో 4జీ ఎల్టీఈ సపోర్ట్ ఉంది. లెనోవో ఫోన్‌లో ఏర్పాటు చేసిన ప్రీమియమ్ లుకింగ్ అల్యుమినియమ్ కేసింగ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Vibe K5 vs Micromax Canvas Fire 5: Which Budget Smartphone is Your Choice?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot