డ్యూయెల్ సెల్ఫీ కెమెరాల గుట్టు విప్పిన లెనోవా

Posted By:

సంచలనాతో దూసుకుపోతున్న లెనోవా మరో సంచలనానికి తెరలేపింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న డ్యూయెల్ కెమెరా గుట్టు విప్పేసింది. స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోనే ఫస్ట్ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరాలతో లెనోవా స్మార్ట్ ఫోన్లను ఐఎప్ ఎ 2015షో లో రిలీజ్ చేసింది. వైబ్ ఎస్ 1,పీ1,అలాగే పీ1ఎమ్ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లు అదిరేటి లుక్ తో షోలో అలరిస్తున్నాయి. సో వాటి ఫీచర్స్ పై ఓ లుక్కేద్దాం.

Read more : రూ.75కే, త్వరపడండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2 ఫ్రంట్ కెమెరాలు

లెనోవా నుంచి దూసుకొచ్చిన ఎస్ 1తో ఫ్రంట్ సైడ్ 8 మెగా ఫిక్సల్ కెమెరాతో అదిరిపోయో ఫోటోలను తీయవచ్చు. ఫ్రంట్ 2 మెగా ఫిక్షల్ ఒకటి, 8 మెగా ఫిక్షల్ ప్రైమరీ తో 2 కెమెరాలు ఉంటాయి.

ఫోకస్ ను ఛేంజ్

ఫోటోను తీసిన తరువాత దాని ఫోకస్ ను ఛేంజ్ చేసుకునే విధంగా ఉంటుంది. కంపెనీ వివిధ రకాల టూల్స్ ను ఫోటోలు ఎడిట్ చేసేందుకు ఈ ఫోన్ లో ప్రవేశపెట్టింది. కట్ కట్ ఫేస్ట్ అలాగే కాపీ లాంటి ఆప్సన్స్ కూడాఉంటాయి. 

సెల్పీ బ్యాక్ గ్రౌండ్ లో మీరు కావలిసిన ఎపెక్ట్ లు

ఫోటోను క్రాప్ చేస్తూనే ఇంకో ఫోటోలోకి వెళ్లే విధంగా ఈ స్మార్ట్ ఫోన్లను డిజైన్ చేశారు. ఇక సెల్పీ బ్యాక్ గ్రౌండ్ లో మీరు కావలిసిన ఎపెక్ట్ లు చేసుకునే వీలు కూడా ఉంది.

132 గ్రాముల బరువు

ఇక ఈ ఫోన్ లో 13 మెగా ఫిక్షల్ కెమెరాతో డ్యూయెల్ ఫ్లాష్ కలర్స్ తో ఫోటోలు తీసేయవచ్చు. డిజైన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ గొరిల్లా గ్లాస్ తో డిజైన్ చేశారు. చుట్టూ మెటల్ ప్రేమ్ తో డిజైన్ చేశారు. 132 గ్రాముల బరువు అలాగే 7.8 మెస్యూర్ ను కలిగి ఉంటుంది.

32 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజి

5 ఇంచ్ హెచ్ డి డిస్ ప్లే తో 1080 రిజల్యూషన్ తో ఫోటోలను తిలకించవచ్చు. 64 బిట్ మీడియా టెక్ ఆక్టో కోర్ ప్రాసెసర్ తో 3జిబి ర్యామ్ ను కలిగి ఉంటుంది. 32 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజి 128 జిబి వరకు మైక్రో ఎస్ డి కార్డ్ సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తుంది.

అడిషనల్ గా షేర్ ఇట్ ఆప్సన్

దీంతో పాటు మీకు అడిషనల్ గా షేర్ ఇట్ ఆప్సన్ ప్రీ లోడ్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. 4జీ ఎల్ టీఈ,వైఫై బ్లూటూత్ లాంటి ఆప్సన్స్ ఉన్నాయి.

రెండు కలర్స్ లో

ఈ పోన్ రెండు కలర్స్ లో మీకు లభిస్తుంది..ఒకటి పెరల్ వైట్ కలర్ మరొకటి మిడినైట్ బ్లూ నవంబర్ నుంచి అమ్మకాలు మొదలుపెడతామని లెనోవా కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

ధర రూ.19810

ఇది దాదాపు 299 డాలర్లు దరిదాపులో ఉండే అవకాశం ఉంది.ఇక మన కరెన్సీలో అయితే రూ.19810 ఉండే అవకాశం ఉంది.

వైబ్ పీ1 అలాగే పీ1ఎమ్

వీటితో పాటు వైబ్ పీ1 అలాగే పీ1ఎమ్ లు కూడా దగ్గర దగ్గర ఫీచర్లతో దూసుకువస్తున్నాయి.

అక్టోబర్ నుంచి మార్కెట్ లోకి

ఈ రెండు ఫోన్లు అక్టోబర్ నుంచి మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. వైబ్ పీ 1 ధర 279 డాలర్లు అలాగే వైబ్ పీ1ఎమ్ ధర 159 డాలర్లని లెనోవా యాజమాన్యం తెలియజేసింది.

డ్యూయెల్ సెల్ఫీలను తీసుకునేందుకు రెడీ కండి

డ్యూయెల్ సెల్ఫీలను తీసుకునేందుకు రెడీ కండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write lenovo vibe s1 with dual selfie camera set up launched at ifa 2015
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot