ఆన్‌లైన్ మార్కెట్లోకి లెనోవో వైబ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్

Posted By:

గతవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరింపబడిన స్మార్ట్ ఫోన్ ‘లెనోవో వైబ్ ఎక్స్' ఇప్పుడు ఆన్ లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ ఇకామర్స్ వైబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ను 25,829కి ఆఫర్ చేస్తోంది. లెనోవో నుంచి ఇటీవల విడుదులైన ‘లెనోవో కే900' స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో మంచి రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

ఆన్‌లైన్ మార్కెట్లోకి లెనోవో వైబ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్

లెనోవో వైబ్ ఎక్స్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), 441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ ఎంటీ6589టీ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్), పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్5544ఎంపీ 2 గ్రాఫిక్స్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, కనుక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, ఏజీపీఎస్, 3జీ సపోర్ట్, గ్రావిటేషన్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్ ఇంకా ఇ-కంపాస్ సెన్సార్, ఫోన్ బరువు 121 గ్రాములు, 2000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot