లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

|

2014 ఆరంభం నుంచి అనేక స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలను మనం చూస్తూనే ఉన్నాం. బార్సిలోనా (స్పెయిన్) వేదికగా ఇటీవల చోటుచేసుకున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆకట్టుకునే ఫీచర్లు ఇంకా అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లతో కూడిన శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్‌ను లెనోవో ఇటీవల ఆవిష్కరించింది. లెనోవో వైబ్ జెడ్ (Vibe Z) పేరుతో పరిచయమైన ఈ సరికొత్త ఆండ్రాయిడ్ డివైస్ ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది.

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

లెనోవో వైబ్ జెడ్ కీలక స్పెసిఫికేషన్‌లు

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, పటిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో, 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ. శక్తివంతమైన క్వాల్కమ్ చిప్‌సెట్, స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ సాక్ (క్లాక్ వేగం 2.2గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా 4128 x 3096 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటితో ( ప్రత్యేకమైన ఫీచర్లు: ఆటో ఫోకస్, ఎఫ్1.8 అపెర్చర్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ( ప్రత్యేకతలు:
వైడ్-యాంగిల్ షాట్‌లను చిత్రీకరించుకునేందుకు 84డిగ్రీల లెన్స్ అలానే వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు). కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: జీపీఆర్ఎస్, స్పీడ్, WLAN, బ్లూటూత్, యూఎస్బీ, 3జీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ. శక్తివంతమైన లై-పో 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫోన్‌లో అమర్చారు. ఇండియన్ మార్కెట్లో లెనోవో వైబ్ జెడ్ స్మార్ట్‌ఫోన్ 16జీబి మెమెరీ వేరియంట్‌లో లభ్యమవుతుంది. ఫోన్ పరిమాణాన్ని పరిశీలించినట్లయితే 149.1 x 77 x 7.9మిల్లీ మీటర్లు.

ధర..

ఆవిష్కరణ సమయంలో లెనోవో వైబ్ జెడ్ ధర రూ.35,999. ప్రస్తుత మార్కెట్ ధర రూ.32,960. మరో 7 రోజుల్లో ఈ డివైస్ ఇండియన్ మార్కెట్లో లభ్యంకానుంది. రిటైలింగ్ అమ్మకాలు మరో 10 రోజుల్లో ప్రారంభమవుతాయి. ఔత్సాహికులు ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ TheDoStore ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. పరిచయ ఆఫర్‌లో భాగంగా లెనోవో వైబ్ జెడ్ కొనుగోలు పై రూ.2,039 విలువ చేసే జెడ్ స్మార్ట్‌టచ్ కవర్‌ను ఉచితంగా కంపెనీ అందిస్తోంది. లెనోవో వైబ్ జెడ్ ఉత్తమ ఎంపిక అనటానికి 10 అత్యుత్తమ కారణాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

అద్భుతమైన నిర్మాణం

కేవలం ఫీచర్ల విషయంలోనే కాదు నిర్మాణ శైలిలోని లెనోవో వైబ్ జెడ్ అద్భుతమైన డిజైనింగ్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ పరిమాణం 149.1 x 77 x 7.9మిల్లీ మీటర్లు. బరువు కేవలం 145.2 గ్రాములు. 5.5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్), మన్నికైన పాలీకార్బొనేట్ మెటల్‌తో లెనోవో వైబ్ జెడ్‌ను చూడచక్కని రీతిలో డిజైన్ చేసారు.

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

శక్తివంతమైన ఫీచర్లు...

లెనోవో వైబ్ జెడ్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. భవిష్యత్‌లో కిట్‌క్యాట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డివైస్ పనితీరును వేగవంతం చేయటంలో 2.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్రెయిట్ 400 సామర్థ్యంతో కూడిన స్నాప్‌డ్రాగన్ 800 చిప్‌సెట్ కీలక భూమిక పోషిస్తుంది. 2జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు సహకరిస్తుంది.

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!
 
లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

పెద్దదైన తాకే తెర

5.5 అంగుళాల ఐపీఎస్ టచ్‌స్ర్కీన్ లెనోవో వైబ్ జెడ్‌కు ప్రధానమైన ప్రత్యేకత. ఈ తెర పై అన్ని అప్లికేషన్‌లను చక్కగా రన్ చేసుకోవచ్చు. పలుచటి మరియు నాజూకు డిస్‌ప్లే యూజర్‌కు స్మూత్ మొబైల్ బ్రౌజింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది. గేమింగ్.. చాటింగ్.. నెట్ బ్రౌజింగ్ ఇంకా ఇతర మల్టీ మీడియా అవసరాలను ఈ తెర చక్కగా తీరుస్తుంది. సరిగ్గా చేతిలో ఇమిడిపోగలిగే తత్వాన్ని లెనోవో వైబ్ జెడ్‌ కలిగి ఉండటం విశేషం.

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

స్మార్ట్ డైలర్ ఆప్షన్

లెనోవో వైబ్ జెడ్‌లో నిక్షిప్తం చేసిన స్మార్ట్ డైలర్ ఫీచర్ వన్ హ్యాండెడ్ కాలింగ్‌కు ఉపకరిస్తుంది. అంటే ఏవైనా కాల్స్ వచ్చిన సమయంలో ఫోన్‌ను మీ చెవి దగ్గర హోల్డ్ చేసి ఉంచితే చాలు ఆటోమెటిక్‌గా కాల్ రిసీవ్ అవుతుంది.

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్

లెనోవో వైబ్ జెడ్ అనేకమైన యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్ ఫీచర్లను కలిగి ఉంది. మల్టీ విండో ఫీచర్ ఆకట్టుకుంటుంది.

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

13 మెగా పిక్సల్ రేర్ కెమెరా

లెనోవో వైబ్ జెడ్ 4128 x 3096 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 13 మెగా పిక్సల్ సామర్థ్యం గల రేర్ కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఆటో ఫోకస్, ఎఫ్1.9 అపెర్చర్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకమైన సౌకర్యాలు ఈ కెమెరాకు ఉన్నాయి.

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

ఫోన్ ముందు ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా మన్నికనై వీడియో కాలింగ్‌కు ఉపకరిస్తుంది. అంతేకాదు, కెమెరాలో దోహదం చేసిన 84డిగ్రీల లెన్స్ ఫీచర్ వైడ్-యాంగిల్ షాట్‌లను చిత్రీకరించుకునేందుకు తోడ్పడుతుంది.

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

ప్రత్యేకమైన ఇన్-బుల్ట్ కెమెరా ఫీచర్లు

ఫోటోలను అందంగా తీర్చిదిద్దే ఫోటో ఫిల్టర్స్, సీన్ మోడ్స్ తదితర ప్రత్యేకమైన సౌలభ్యతలను వెబ్ జెడ్ కెమెరా వ్యవస్థలో ఇన్‌స్టాల్ చేసారు. ఈ ఫీచర్ల సహకారంలో మీరు క్యాప్చర్ చేసిన ఫోటోలను ఉత్తమంగా తీర్చిదిద్దవచ్చు.

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

మన్నికైన బ్యాటరీ వ్యవస్థ

లెనోవో వైబ్ జెడ్ మన్నికైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది. యూట్యూబ్‌లో గంటల తరబడి విహరించినప్పటికి బ్యాటరీ జ్యూస్ ఏమాత్రం తగ్గదు. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 15 గంటల పై చిలుకు బ్యాకప్‌ను సమకూరుస్తుంది.

 లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

లెనోవో వైబ్ జెడ్.. మీ తరువాతి స్మార్ట్‌ఫోన్!

సమ్‌థింగ్ స్పెషల్

లెనోవో వైబ్ జెడ్ మీకు సమ్‌థింగ్ స్సెషల్‌గా అనిపిస్తుంది. ఎంపిక చేయబడిన రిటైల్ మార్కెట్లలో మాత్రమే ఈ ఫోన్‌ను విడుదల చేస్తున్నారు. వాటిలో మన ఇండియా ఒకటి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X