లెనోవో వైబ్ జెడ్ ‘మీ రూపాయికి ఖచ్చితమైన విలువ’

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్ మొబైల్ ఫోన్‌లు లభ్యమవుతన్న తరుణంలో అత్యధిక శాతం భారతీయులు తమ ఫీచర్ ఫోన్‌ల స్థానాన్ని స్మార్ట్‌ఫోన్‌ల‌తో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. స్మార్ట్ మొబైలింగ్ విభాగంలో 2013 ఆరంభ నుంచి చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు వ్యాపారం ఎదుగుదలకు ఓ కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లను టార్గెట్ చేస్తూ అనేక కంపెనీలు వివిధ మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చాయి.

 

వినియోగదారులకు అత్యత్తమ సాంకేతిక ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో ఇటీవల మొబైల్ ఫోన్‌ల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన లెనోవో తన తాజా ఆవిష్కరణ ‘లెనోవో వైబ్ జెడ్' ఫాబ్లెట్‌తో మార్కెట్ వర్గాల్లో చర్చనీయంశమైంది. అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ సౌకర్యాలతో 2014 ఆరంభంలో మార్కెట్‌కు పరిచయమైన పెద్దతెర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లెనోవో వైబ్ జెడ్ ఆకట్టుకునే ఫీచర్లతో వినియోగదారులకు ఉత్తమ ఎంపికగా నిలిచింది. ఆకర్షణీయమైన నిర్మాణ శైలి, అత్యాధునిక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, సమర్థవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన స్టోరేజ్ వ్యవస్థ వంటి అంశాలు లెనోవో వైబ్ జెడ్ విశిష్టతను మరింతగా బలోపేతం చేసాయి.

లెనోవో వైబ్ జెడ్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

హైడెఫినిషన్ సామర్థ్యంతో కూడిన 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. శక్తివంతమైన క్వాల్కమ్ చిప్‌సెట్, స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ సాక్ (క్లాక్ వేగం 2.2గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా 4128 x 3096 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటితో ( ప్రత్యేకమైన ఫీచర్లు: ఆటో ఫోకస్, ఎఫ్1.8 అపెర్చర్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ( ప్రత్యేకతలు: వైడ్-యాంగిల్ షాట్‌లను చిత్రీకరించుకునేందుకు 84డిగ్రీల లెన్స్ అలానే వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు). కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: జీపీఆర్ఎస్, స్పీడ్, WLAN,బ్లూటూత్, యూఎస్బీ, 3జీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ. శక్తివంతమైన లై-పో 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫోన్‌లో అమర్చారు. ఇండియన్ మార్కెట్లో లెనోవో వైబ్ జెడ్ స్మార్ట్‌ఫోన్ 16జీబి మెమెరీ వేరియంట్‌లో లభ్యమవుతుంది. ఫోన్ పరిమాణాన్ని పరిశీలించినట్లయితే 149.1 x 77 x 7.9మిల్లీ మీటర్లు.

ఆవిష్కరణ సమయంలో లెనోవో వైబ్ జెడ్ ధర రూ.35,999. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఈ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను ధర రూ.32,960కు సొంతం చేసుకునే అవకాశాన్ని కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ TheDoStore కల్పిస్తోంది. లెనోవో వైబ్ జెడ్ కొనుగోలు పై రూ.2,039 విలువ చేసే వైబ్ జెడ్ బాక్సును సైట్ ఉచితంగా అందిస్తోంది. లెనోవో వైబ్ జెడ్‌లోని 10 ఆకట్టుకునే ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో స్మార్ట్ యూజర్ ఇంటర్‌ఫేస్

లెనోవో వైబ్ జడ్ ఆకట్టుకున్న స్మార్ట్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంటర్‌ఫేస్ సాయంతో ఫోన్‌ను సులువుగా క్రంటోల్ చేయవచ్చు. ఉదాహరణకు: కాల్‌ను రిసీవ్ చేసుకునే సమయంలో ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుంటే చాలు ఆటోమెటిక్‌గా కాల్ ఆన్సర్ అవుతుంది.

 

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

టాప్ కెమెరా సపోర్ట్:

అత్యాధునిక కెమెరా వ్యవస్థను లెనోవో వైబ్ జెడ్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా 84 డిగ్రీల వైడ్ యాంగిల్స్ లెన్స్‌ను కలిగి అత్యుత్తమ వీడియో కాలింగ్‌కు దోహదపడుతుంది. అలానే, ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ కెమెరా ప్రత్యేక బీఎస్ఐ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ కెమెరా ద్వారా 1080 పిక్సల్ రిసల్యూషన్ కాలిటీతో కూడిన హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

 

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు
 

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం

లెనోవో వైబ్ జెడ్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.3 ఆపరేటింగ్ వర్షన్ పై స్పందిస్తుంది. ఈ సౌకర్యంతో యూజర్ అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను ఆస్వాదించవచ్చు.

 

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

ఆకట్టుకునే డిస్‌ప్లే

లెనోవో వైబ్ జెడ్ ఆకట్టుకునే డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంది. వైబ్ జెడ్‌లో ఏర్పాటు చేసిన 5.5 అంగుళాల హైడెఫినిషన్ రిసల్యూషన్ డిస్‌ప్లే 1920 x 1080పిక్సల్ రిసల్యూషన్‌తో ఫోన్ పనితీరును మరింత ప్రభావితం చేస్తుంది. ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో వీక్షణ, ఆన్‌లైన్ గేమింగ్, చాటింగ్ వంటి అంశాలకు ఈ డిస్ప్లే మరింత అనువుగా ఉంటుంది.

 

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్:

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 800 2.5గిగాహెట్జ్ ప్రాసెసర్‌ను లెనోవో వైబ్ జెడ్‌లో ఫిట్ చేసారు. తద్వారా ఫోన్‌లోని అప్లికేషన్‌లను, వీడియోలను, 3డీ గేమ్‌లను సమర్థవంతంగా రన్ చేసుకోవచ్చు. అడ్రినో 330 గ్రాఫిక్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ వ్యవస్థను మరింతగా బోలపేతం చేస్తుంది.

 

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో డూఇట్ అప్లికేషన్:

లెనోవో వైబ్ జెడ్‌లో ప్రవేశపెట్టిన సరికొత్త లెనోవో డూఇట్ అప్లికేషన్ ద్వారా డేటాను ఇతర స్మార్ట్‌ఫోన్‌లలోకి ఏ విధమైన నెట్‌వర్క్ సహాయం లేకుండా షేర్ చేసుకోవచ్చు. ఈ షేరింగ్ పూర్తిస్థాయి భద్రతతో ఉంటుంది.

 

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

సులువుగా ఉపయోగించుకోగలిగే తత్వం:

లెనోవో వైబ్ జెడ్ సరిగ్గా మీ ప్యాంట్ జేబులో ఇమిడిపోతుంది. ఫోన్ బరువు 147 గ్రాములు. ఫోన్‌‍కు అనుసంధానించిన లేజర్ ఫ్యాబ్రిక్ ఫీర్ రేర్ కవర్ ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. ఫోన్ డిస్‌ప్లే క్రింది భాగంలో ఏర్పాటు చేసిన మూడు కెపాసిటివ్ బటన్లు ఫోన్ పనితీరును మరింత వేగవంతం చేస్తాయి.

 

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

శక్తివంతమైన బ్యాటరీ:

లెనోవో వైబ్ జెడ్‌లో శక్తివంతమైన నాన్-రిమూవబుల్ లై-పో 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీని నిక్షిప్తం చేసారు. ఈ బ్యాటరీ మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.

 

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

అత్యుత్తమ అప్లికేషన్స్ ఇంకా గేమ్స్

మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను లెనోవో వైబ్ జెడ్‌లో ప్రీ-లోడ్ చేసారు. ఎవర్‌నోట్, యాక్యూవెదర్, ఫేస్‌బుక్, స్కైప్, ట్విట్టర్, యూసీ బ్రౌజర్, రూట్ 66 నావీ+ మ్యాప్స్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్ వంటి అప్లికేషన్‌లను లెనోవో వైబ్ జెడ్‌లో చూడొచ్చు. రియల్ ఫుట్‌బాల్, గ్రీన్‌ఫార్మ్ 3 వంటి గేమ్‌లను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు.

 

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

లెనోవో వైబ్ జెడ్.. 10 అత్యుత్తమ ఫీచర్లు

4జీ ఎల్టీఈ

లెనోవో వైబ్ జెడ్‌లో ఏర్పాటు చేసిన 4జీ కనెక్టువిటీ ఫీచర్ వేగవంతమైన ఇంటర్నట్ బ్రౌజింగ్‌కు ఉపకరిస్తుంది.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X