ఐఎఫ్ఎ 2014: కొత్త ఫోన్‌లను ఆవిష్కరించిన లెనోవో

Posted By:

 ఐఎఫ్ఎ 2014: కొత్త ఫోన్‌లను ఆవిష్కరించిన లెనోవో

ఐఎఫ్ఎ 2014 (IFA 2014) ప్రచార పర్వాన్ని తనదైన శైలిలో ఆరంభించిన లెనోవో గురువారం బెర్లిన్‌లో ఏర్పాటు చేసిన ఐఎఫ్ఎ 2014 ప్రీ ఈవెంట్‌లో భాగంగా వైబ్ జెడ్2, వైబ్ ఎక్స్2 వేరియంట్‌లలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. కేవలం 7.8 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకున్న వైబ్ జెడ్2 స్మార్ట్‌ఫోన్ 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి సెల్ఫీలను అత్యుత్తమ క్వాలిటీతో చిత్రీకరించునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ 64 బిట్ ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌ను తర్వలోనే చైనా మార్కెట్లో విడుదల చేస్తారు. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు. ఫోన్ ధర రూ.26,000. మరో ఫోన్ లెనోవో వైబ్ ఎక్స్2 4జీ ఎల్టీఈ కనెక్టువిటీని కలిగి ఆక్టా‌కోర్ ప్రాసెసర్ పై స్పందిస్తుంది. ఫోన్ ధర రూ.24,043.

 ఐఎఫ్ఎ 2014: కొత్త ఫోన్‌లను ఆవిష్కరించిన లెనోవో

లెనోవో వెబ్ జెడ్2 స్పెసిఫికేషన్‌లు.... ఫోన్ పరిమాణం 148.50 x 76.40 x 7.80మిల్లీ మీటర్లు, బరువు 158 గ్రాములు,  5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్ 8916 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.26,000. విడుదల - అక్టోబర్ 2014.

 ఐఎఫ్ఎ 2014: కొత్త ఫోన్‌లను ఆవిష్కరించిన లెనోవో

లెనోవో వెబ్ ఎక్స్2 స్పెసిఫికేషన్‌లు.... ఫోన్ చుట్టుకొలత 140.20 x 68.60 x 7.27 మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు, 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.24,043. విడుదల - అక్టోబర్ 2014.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Lenovo Vibe Z2 'Selfie' Phone Finally Launched at IFA 2014: Its First 64-Bit Smartphone. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot