లెనోవో డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్.. వాటర్‌ప్రూఫ్ స్టామినాతో!

Posted By: Prashanth

లెనోవో డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్.. వాటర్‌ప్రూఫ్ స్టామినాతో!

 

చైనాకు చెందిన ప్రముఖ పర్సనల్ కంప్యూటర్‌ల తయారీ సంస్థ లెనోవో ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే సరికొత్త డ్యూయల్ సిమ్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో ప్రకటించింది. డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడిన నేపధ్యంలో త్వరలో లెనోవో తన శక్తివంతమైన డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌ను కేవలం చైనాకే పరిమితం చేయకుండా ఫిలిప్పిన్స్, ఇండోనేషియా, ఇండియా వంటి ప్రముఖ దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

లెనోవో ఏ660 మోడల్ లో డిజైన్ కాబడిన ఈ డివైజ్ కీలక ఫీచర్లు:

డ్యూయల సిమ్,

వాటర్ ప్రూఫ్ ఇంకా డస్ట్ ప్రూఫ్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

4 అంగుళాల పటిష్టమైన టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

3జీ కనెక్టువిటీ,

1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ ధర ఇతర విడుదల వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం వెల్లడికావల్సి ఉంది.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot