రూ. 20 వేల ఫోన్ రూ. 10,999కే..

Written By:

ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో Z2 Plus ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. గతంలో రూ. 3 వేలు తగ్గిన ఈ ఫోన్ ఇప్పుడు ఏకంగా భారీ డిస్కౌంట్ లో లభిస్తుంది. లాంచ్ సమయంలో రూ. 19999 ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ.10,999కే లభిస్తోంది. 4జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ ఫోన్ ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

దుమ్మురేపుతున్న పేటీఎమ్ డిస్కౌంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 10, 999కే 64జీబి వేరియంట్

64జీబి వేరియంట్ పై రూ.9000 తగ్గింపును లెనోవో ఆఫర్ చేస్తోంది. లాంచ్ సమయంలో ఈ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.10,999కే ఈ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు. Amazon India  ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

లెనోవో జుక్ జెడ్2 ప్లస్ స్పెసిఫికేషన్స్...

5- ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిజైన్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ప్రత్యేకతలు

f/2.2 aperture, PDAF, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాస్, 4కే వీడియో రికార్డింగ్, స్లో మోషన్ 720 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్)

8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు:

f/2.2 aperture, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ, డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్స్, 4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

ఫైబర్ గ్లాస్ బాడీ

లెనోవో జెడ్2 ప్లస్, ఫైబర్ గ్లాస్ బాడీతో వస్తోంది. ఇది మెటల్ బాడీతో పోలిస్తే 45% తక్కువ బరువుగాను 25% ఎక్కువ ధృడత్వాన్ని కలిగి ఉంటుంది. లెనోవో జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిని రీడిజైనిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ సరికొత్త అనుభూతులతో కూడిన క్విక్ టాగిల్ నోటిఫికేషన్ ప్యానల్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది.

స్మార్ట్‌ ఫింగర్ ప్రింట్ స్కానర్

లెనోవో జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు స్మార్ట్‌ ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 99.7శాతం ఖచ్చితత్వంతో పనిచేసే సెల్ఫ్ లెర్నింగ్ అల్గారిథమ్ వ్యవస్థను ఈ సెన్సార్‌లో ఏర్పాటు చేసారు. ఈ సెన్సార్‌ను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

ప్రత్యేకంగా రీడిజైన్

లెనోవో జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రీడిజైన్ చేసారు. VoLTE ఫీచర్‌తో వస్తోన్న రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

లాంగ్ స్ర్కీన్ షాట్, క్యారియర్ అగ్రిగేషన్

గూగుల్ నౌను డీఫాల్ట్ లాంచర్‌గా అందిస్తున్నారు. లాంగ్ స్ర్కీన్ షాట్, క్యారియర్ అగ్రిగేషన్, 3జీ ఫాల్ బ్యాక్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

యూ హెల్త్ పేరుతో ఫిట్నెస్ యాప్

యూ హెల్త్ పేరుతో సరికొత్త ఫిట్నెస్ యాప్‌ను లెనోవో ఈ ఫోన్ ద్వారా పరిచయం చేసింది. క్వాల్కమ్ సెన్సార్ సహకారంతో పనిచేసే ఈ యాప్ మీ నడకను ట్రాక్ చేసి కరిగించిన క్యాలరీలకు సంబంధించిన వివరాలను తెలుపుతుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన pedometer వ్యవస్థను లెనోవో ఈ ఫోన్ లో ఏర్పాటు చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Z2 Plus Price Slashed In India, Now Starts At 10,999 Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot