అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన Lenovo Z5 Pro
భారీ అంచనాల మధ్య లెనోవో తన లేటెస్ట్ స్మార్ట్‌పోన్ చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. Lenovo Z5 Pro పేరుతో ఇది చైనా మార్కెట్లోకి విడుదలయింది.
భారీ అంచనాల మధ్య లెనోవో తన లేటెస్ట్ స్మార్ట్‌పోన్ చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. Lenovo Z5 Pro పేరుతో ఇది చైనా మార్కెట్లోకి విడుదలయింది. ఈ నెలలోనే ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఇండియాలో విడుదలపై కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం బ్లాక్ కలర్ వెర్షన్‌లో మాత్రమే ఈ ఫోన్ విడుదల చేసారు. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.ఫీచర్ల విషయానికొస్తే ...

ధర...
Lenovo Z5 Pro 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.21,148 ఉండగా, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.24,320 గా ఉంది.

6.39 ఇంచుల భారీ డిస్‌ప్లే...
ఇందులో 6.39 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

నాలుగు కెమెరాలు....
ఇందులో నాలుగు కెమెరాలు అమర్చారు . ముందు భాగంలో 16, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు.వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి.

ఫీచర్లు...
6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 × 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫేస్ అన్‌లాక్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








