ఈ స్మార్ట్‌ఫోన్‌లో 10 లక్షల ఫోటోలు, 2000 హెచ్‌డీ మూవీలు స్టోర్ చేసుకోవచ్చు

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చరిత్ర సృష్టించబోతోంది. ప్రపంచంలో ఏ కంపెనీ తీసుకురాని విధంగా 4TB storageతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చరిత్ర సృష్టించబోతోంది. ప్రపంచంలో ఏ కంపెనీ తీసుకురాని విధంగా 4TB storageతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. Lenovo Z5 పేరుతో వస్తున్న ఈ ఫోన్ లో 10 లక్షల ఫోటోలను, 2000 హెచ్‌డీ మూవీలను స్టోర్‌ చేసుకునే సామర్ధ్యం ఉంది. Lenovo Z5 పేరుతో పిలవబడే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లో ఎవరు ఊహించని రీతిలో భారీ మొత్తంలో ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని లెనోవో వైస్‌ ప్రెసిడెంట్‌ ఛాంగ్‌ ఛెంగ్‌ చైనీస్‌ సోషల్‌ నెటివర్కింగ్‌ వెబ్‌సైట్‌ వైబో ద్వారా తెలియజేశారు. ఫోన్ పూర్తి వివరాల్లో కెళితే..

 

వన్‌ప్లస్‌ దెబ్బ, శాశ్వతంగా తగ్గిన షియోమి Mi MIX 2 ధరవన్‌ప్లస్‌ దెబ్బ, శాశ్వతంగా తగ్గిన షియోమి Mi MIX 2 ధర

Lenovo Z5 4TB storageతో..

Lenovo Z5 4TB storageతో..

సాధారణంగా128 GB లేదా 256 GB, 512 GB సామర్ధ్యంతో మార్కెట్లో కొన్ని కంపెనీ ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే లెనోవో నుంచి రానున్న Lenovo Z5 4TB storageతో 10 లక్షల ఫోటోలను, 2000 హెచ్‌డీ మూవీలను స్టోర్ చేసుకునే విధంగా తీసుకువస్తోంది.

Lenovo Smartistan

Lenovo Smartistan

కంపెనీ ఇప్పటికే 1TB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Lenovo Smartistan అనే ఫోన్‌ని తాజాగా మార్కెట్లోక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇండియాకి ఇంకా రాలేదు అంతర్జాతీయ మార్కెట్లో విడుదలయింది. దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం 93 వేల రూపాయలకు పైగానే ఉంది. మరి కంపెనీ నుంచి రానున్న 4TB storage ఫోన్ దీని కన్నా అధిక ధర ఉండే అవకాశం ఉంది.

Vivo APEX smartphone
 

Vivo APEX smartphone

Vivo APEX smartphone ఇప్పటిదాకా మార్కెట్లో అత్యంత పెద్దమొత్తంలో స్క్రీన్ టు బాడీ రేషియోగా ( 91%) గా ఉంది. Lenovo Z5 దీన్ని అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

18 రకాల టెక్నాలజీ పేటెంట్ లను

18 రకాల టెక్నాలజీ పేటెంట్ లను

లెనోవో కంపెనీ ఇప్పటికే 18 రకాల టెక్నాలజీ పేటెంట్ లను సంపాదించిందని తెలుస్తోంది. ఇందులో నాలుగు రకాల టెక్నాలజీని ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం వాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లీకయిన ఇమేజ్ ని బట్టి చూస్తే..

లీకయిన ఇమేజ్ ని బట్టి చూస్తే..

లేటెస్ట్ గా లీకయిన ఇమేజ్ ని బట్టి చూస్తే electric blue bodyతో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. కాగా కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఛాంగ్‌ ఛెంగ్‌ పోస్టులో New national flagship declaration అని మెన్సన్ చేయడంతో కొన్ని ఆసక్తికర అంశాలను అది రేకెత్తిస్తోంది.

8/10 జిబి ర్యామ్ ఉండే అవకాశాలు

8/10 జిబి ర్యామ్ ఉండే అవకాశాలు

Lenovo Z5 ఫోన్లో in-display fingerprint scanner, బెజిల్ లెస్ డిస్ ప్లే , 8/10 జిబి ర్యామ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ తొలుత చైనాలో లాంచ్‌ కాబోతుంది. త్వరలోనే భారత్‌కు కూడా రానున్నట్టు తెలుస్తోంది. ప్రాక్టికల్‌ టెక్నాలజీతో ఇది రూపొందుతోందని తెలుస్తోంది. మరిన్ని విషయాల కోసం మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

 

 

Best Mobiles in India

English summary
Lenovo Z5 will be the world’s first phone to come with 4TB storage.With this much storage, users will be able to save 2,000 HD movies, 150,000 lossless music files, and 1 million photos in the smartphone. more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X