భారీ ఫీచర్లతో దిగ్గజాలను వెక్కిరిస్తున్న Lenovo Z5, జూన్ 5న ముహూర్తం

|

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో టెక్ దిగ్గజాలకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోంది. ఇప్పుడున్న ఉన్న ఫోన్లను వెక్కిరిస్తూ తన సరికొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ Lenovo Z5ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. జూన్‌ 5న చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయాన్ని లెనోవో వైస్‌ ప్రెసిడెంట్‌ ఛాంగ్‌ ఛెంగ్‌ చైనీస్‌ సోషల్‌ నెటివర్కింగ్‌ వెబ్‌సైట్‌ వైబో ద్వారా తెలియజేశారు.తమ కంపెనీ నుంచి రాబోతున్న ఫోన్ ఫీచర్లను లీకు చేసి దిగ్గజాలకు షాక్ ఇచ్చారు. స్మార్ట్ ఫోన్ చరిత్రలో లేని ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయని తెలిపారు. మరి అంతలా ఫీచర్లు ఏం ఉన్నాయో ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 10 లక్షల ఫోటోలు, 2000 హెచ్‌డీ మూవీలు స్టోర్ చేసుకోవచ్చుఈ స్మార్ట్‌ఫోన్‌లో 10 లక్షల ఫోటోలు, 2000 హెచ్‌డీ మూవీలు స్టోర్ చేసుకోవచ్చు

10 లక్షల ఫోటోలు, 2000 హెచ్‌డీ మూవీలు

10 లక్షల ఫోటోలు, 2000 హెచ్‌డీ మూవీలు

10 లక్షల ఫోటోలు, 2000 హెచ్‌డీ మూవీలు స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్‌ చేసుకునేలా.. అ‍త్యధిక మొత్తంలో స్టోరేజ్‌ ఆప్షన్‌తో లెనోవో కొత్త ఫ్లాగ్‌షిప్‌ Lenovo Z5 జూన్‌ 5న చైనా మార్కెట్లో విడుదలవుతోంది.ఆ తర్వాత ఇండియాకి రానుంది.

ఏఐ ఆధారిత డ్యూయల్‌ కెమెరా

ఏఐ ఆధారిత డ్యూయల్‌ కెమెరా

ఏఐ ఆధారిత డ్యూయల్‌ కెమెరా, బెజెల్‌-లెస్‌ డిజైన్‌ ఇది కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. తక్కువ వెలుతురులో కూడా క్లారిటీ ఫోటో తీసుకునేలా, ఫోటోగ్రఫీ అనుభవాన్ని పెంచేలా ఏఐ ఫీచర్‌ను కంపెనీ కల్పిస్తోంది.

4 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
 

4 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

4 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యంతో Lenovo Z5 రానుందని లీకులు చెబుతున్నాయి. Lenovo Z5 ఫోన్లో in-display fingerprint scanner, బెజిల్ లెస్ డిస్ ప్లే , 8/10 జిబి ర్యామ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌కు వెనుక వైపు ఎలక్ట్రిక్‌ బ్లూ బాడీ ఉండనుంది.

45 రోజుల స్టాండ్‌బై టైమ్‌

45 రోజుల స్టాండ్‌బై టైమ్‌

45 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో ఈ ఫోన్‌ రూపొందుతుంది. అంటే ఈ ఫోన్‌లో అత్యంత ఎక్కువ స్టోరేజ్‌ మాత్రమే కాక, అతిపెద్ద బ్యాటరీ కూడా ఉండబోతుందన్నమాట. అయితే ధర ఇతర ఫీచర్లు గురించి బయటకు ఎటువంటి సమాచారం రావడం లేదు.

ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే

ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే

ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే ఇతర ఫోన్లకు గట్టి పోటీనే ఉంటుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీని ధర కూడా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆపిల్, శాంసంగ్ హైఎండ్ ఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు జూన్ 5 వరకు ఎదురుచూడాల్సిందే.

Best Mobiles in India

English summary
Lenovo Z5 with 4TB storage, bezel-less display to launch on June 5 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X