రూ. 14,670కే IPhone X లాంటి స్మార్ట్‌ఫోన్,లెనోవో సంచలనం

|

చైనా దిగ్గజం లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. జడ్5 పేరుతో ఇది చైనా మార్కెట్లోకి విడుదలయింది. ఈ నెలలోనే ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఇండియాలో విడుదలపై కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అరోరా బ్లూ, బ్లాక్, ఇండిగో బ్లూ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదలయింది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల ధరలు రూ.14,670, రూ.18,870గా ఉన్నాయి. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 12వ తేదీ నుంచి అక్కడి అమ్మకానికి వెళ్లనుంది.

 

సింగిల్ అకౌంట్లోనే అన్నీ సర్వీసులు, Airtel తొలి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్సింగిల్ అకౌంట్లోనే అన్నీ సర్వీసులు, Airtel తొలి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్

లెనోవో జడ్5 ఫీచర్లు

లెనోవో జడ్5 ఫీచర్లు

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

6.2 ఇంచుల భారీ డిస్‌ప్లే

6.2 ఇంచుల భారీ డిస్‌ప్లే

ఈ ఫోన్‌లో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆకట్టుకునే రంగులతోపాటు ప్రీమియం లుక్ వచ్చేలా ఈ ఫోన్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు.

 16, 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను
 

16, 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను

దీని వెనుక భాగంలో 16, 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చగా ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు.

ఫస్ట్ బెజిల్ లెస్ స్మార్ట్‌ఫోన్‌

ఫస్ట్ బెజిల్ లెస్ స్మార్ట్‌ఫోన్‌

కాగా లెనోవో నుంచి ఫస్ట్ బెజిల్ లెస్ స్మార్ట్‌ఫోన్‌ ఇదే.OnePlus 6, Xiaomi Mi MIX 2S, అలాగే హైఎండ్ ఫోన్లకు ఇది సవాల్ విసరనుంది. కాగా ఈ ఫోన్ జీరో పర్సంటేజ్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు 30 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది.

కంపెనీ తన టీజర్లో

కంపెనీ తన టీజర్లో

అయితే కంపెనీ తన టీజర్లో ఈ ఫోన్ మీద యూజర్లకు భారీ అంచనాలనే రేకెత్తించింది. 4టిబి స్టోరేజ్ తో ఈ ఫోన్ రాబోతుందని 1 million photographs, 2000 HD movies, 150,000 lossless music files సేవ్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే అదంతా ఈ ఫోన్లో లేదని తేలిపోయింది.

Lenovo A5, Lenovo K5 (2018

Lenovo A5, Lenovo K5 (2018

ఈ ఫోన్ తో పాటు Lenovo A5, Lenovo K5 (2018) ఫోన్లను కూడా ఈవెంట్లో లాంచ్ చేసింది. Lenovo K5 Note (2018) 3GB RAM, 32GB storage మోడల్ ధర 799 yuanగా ఉంది. మన ఇండియన్ కెరెన్సీలో దీని ధర రూ. 8400. అలాగే 4GB RAM, 64GB storage variant ధర రూ. 999 yuan మన ఇండియన్ కెరెన్సీలో దీని ధర సుమారు రూ. 10,500. లెనోవా ఎ5 ధర రూ. 6,300గా ఉంది.

Best Mobiles in India

English summary
Lenovo Z5 with a notch display launched in China All you need to know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X