4జీబి ర్యామ్‌‍తో లెనోవో ZUK Z2, ధర ఎంతంటే..?

Written By:

లెనోవో లేటెస్ట్ హైఎండ్ ఫోన్ ZUK Z2 భారీ అంచనాల మధ్య చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. శక్తివంతమైన స్పెసిఫికేషన్ లతో లాంచ్ అయిన ఈ పవర్ హౌస్ ఫోన్ ధర 1,799 Yuan (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.18,500).

4జీబి ర్యామ్‌‍తో లెనోవో ZUK Z2, ధర ఎంతంటే..?

Read More : ఒక్క యాప్.. 1000 సర్వీసులు!

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాల్లో ఆపరేటింగ్ సిస్టం, 2.15గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ నానో సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ). ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

4జీబి ర్యామ్‌‍తో లెనోవో ZUK Z2, ధర ఎంతంటే..?

Read More : ఈ 10 స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్ (ట్రెండింగ్)

లెనోవో కొద్ది రోజల క్రితమే తన ZUK Z1 ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.13,499. Amazon ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ బాడీ, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌లోని 7 ప్రత్యేకమైన ఫీచర్లు

ఫోన్ రెండు వైపులా 2.5డీ గ్లాస్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫోన్‌లో ఏర్పాటు చేసిన సెల్ఫ్ లెర్నింగ్ థెర్మోస్టాట్ ఇంజిన్ 2.0 టెక్నాలజీ హీటింగ్‌ను ముందుగానే గుర్తించి దానికి తగ్గ నివారణ చర్యలను తీసుకుంటుంది.

లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌లోని 7 ప్రత్యేకమైన ఫీచర్లు

లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌లో యు-టచ్ 2.0 ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్‌ను ఏర్పాటు చేసారు. ఈ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ టెక్నాలజీ హైడెఫినిషన్ ఫింగర్ ప్రింట్ ఇమేజ్ మ్యాచింగ్‌ సపోర్ట్ తో వస్తోంది. స్వీయ అభ్యాస అల్గోరిథం ఫీచర్ ఆకట్టుకుంటుంది. 99.7శాతం ఖచ్చితత్వంతో పనిచేసే ఈ ఫీచర్ ద్వారా 0.1 సెకన్ల వ్యవధిలో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఫింగర్ ప్రింట్ తడిగా ఉన్నప్పటికి ఈ సెన్సార్ స్వీకరిస్తుంది.

లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌లోని 7 ప్రత్యేకమైన ఫీచర్లు

లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌ 5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ 1440 పికల్స్ డిస్‌ప్లేతో వస్తోంది. సింగిల్ హ్యాండ్‌తో ఫోన్‌ను సౌకర్యవంతంగా ఆపరేట్ చేయవచ్చు.

లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌లోని 7 ప్రత్యేకమైన ఫీచర్లు

లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన 2.15గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్‌తో వస్తోంది. పొందుపరిచిన అడ్రినో 530 గ్రాఫిక్స్ యూనిట్ ఫోన్ పనితీరును మరింత మెరుగుపరిచి పవర్ వినియోగాన్ని40 శాతం తగ్గిస్తుంది. 4జీబి ర్యామ్ వేగవంతమైన ప్రాసెసింగ్ ఇంకా మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది.

 

లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌లోని 7 ప్రత్యేకమైన ఫీచర్లు

13 మెగా పిక్సల్ రేరే్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ప్రత్యేకతలు: ఐసోసెల్ సెన్సార్, ఎఫ్2.2 అపెర్చుర్, ఎల్ఈడి ఫ్లాష్. ఇఐఎస్, 5 ఫిజికల్ లెన్స్, హెచ్‌డీఆర్, 4కే వీడియో రికార్డింగ్,

లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌లోని 7 ప్రత్యేకమైన ఫీచర్లు

3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

లెనోవో ZUK Z2 స్మార్ట్‌ఫోన్‌లోని 7 ప్రత్యేకమైన ఫీచర్లు

4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, డ్యుయల్ సిమ్  Android 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo ZUK Z2 Goes Official With These 7 Promising Features. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot