ఎల్‌జి ఆప్టిమస్ బ్లాక్‌ని తలదన్నే విధంగా ఆప్టిమస్ వైట్

Posted By: Staff

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ మార్కెట్లో ఎల్‌జి తన హావాని కోనసాగిస్తుంది. స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయడంతో తనదైన పాత్రని పోషించింది. ఆసియా మొబైల్ మార్కెట్లో ముఖ్యంగా చైనా, ఇండియాలో మంచి సేల్స్‌ని, టర్నోవర్‌ని నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ మద్య కాలంలో కంపెనీ డజన్ల కొద్ది మొబైల్స్ మోడల్స్‌ని విడుదల చేయడం జరిగింది. ఎల్‌జి విడుదల చేసిన ఫోన్లలలో సాధారణం ఫోన్ల నుండి స్మార్ ఫోన్స్ వరకు ఉన్నాయి.

సాధారణంగా మార్కెట్లో ఎల్‌జి విడుదల చేసిన స్మార్ట్ పోన్స్‌కి మంచి గిరాకీ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకునేందుకు ఎల్‌జి మరో స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఎల్‌జి త్వరలో విడుదల చేయనున్న ఈ మోడల్ గతంలో వచ్చిన ఎల్‌జి ఆప్టిమస్ బ్లాక్ మాదిరే ఉంటుందని అన్నారు. ఇక దీనిపేరు ఎల్‌జి అప్టిమస్ వైట్‌గా నామకరణం చేశారు. ఎల్‌జి అప్టిమస్ బ్లాక్‌లో ఏమేమి ఫీచర్స్ ఐతే ఉన్నాయో అలాంటి ఫీచర్సే ఇందులో కూడా ఉన్నాయి. ఎల్‌జి అప్టిమస్ వైట్‌‌కి ఎల్‌జి అప్టిమస్ బ్లాక్‌కి మద్య ఉన్నటువంటి పెద్ద తేడా ఏమిటంటే ఒక్క ప్యానల్ మాత్రమేనని అన్నారు.

ఎల్‌జి ఆప్టిమస్ బ్లాక్‌ని తలదన్నే విధంగా ఆప్టిమస్ వైట్

ఇక ఎల్‌జి అప్టిమస్ వైట్‌ హై మల్టీమీడియా, ఎంటర్టెన్మెంట్ ఫీచర్స్‌ని కలిగి ఉంది. మార్కెట్లో ఉన్న అన్ని రకాలైన వీడియో, ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసేటటువంటి మ్యూజిక్, వీడియో ప్లేయర్స్ ఇందులో పోందుపరచడం జరిగింది. యూజర్స్ కోసం ఇందులో 3.5mm ఆడియో జాక్‌తో పాటు స్టీరియో ఎఫ్ ఎమ్ రేడియో కూడా అమర్చడం జరిగిందని తెలియజేశారు. ఇక డిస్ ప్లే విషయానికి వస్తే 4.0 ఇంచ్ స్క్రీన్‌ని కలిగి ఉండి యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది. ఎల్‌జి ఆప్టిమస్ వైట్ ముందు భాగన 5మెగా ఫిక్సల్ కెమెరాతో చక్కని వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ముందు భాగాన ఉన్న 2మెగా ఫిక్సల్ కెమెరా 3జి నెట్ వర్క్ వీడియో కాలింగ్‌కి ఉపయోగపడుతుంది.

ఇక కమ్యూనికేషన్ టెక్నాలజీ, కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్, Wireless LAN లాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. 2జి టెక్నాలజీలు అయిన GPRS, EDGE ద్వారా ఇంటర్నెట్‌ని చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. 3జి ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా డేటాని 14Mbps స్పీడ్‌తో ట్రాన్పర్ చేయవచ్చు. ఇక ఇందులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో తో రన్ అవుతుంది.

Key LG Optimus White features:

Android OS
32 GB external memory support
3G
Wi-Fi and Bluetooth
5 Mega Pixel camera
Java
Games
The phone is exp

ఎల్‌జి ఆప్టిమస్ వైట్ ధర విషయానికి వస్తే ఎల్‌జి ఆప్టిమస్ బ్లాక్ మాదిరే ఉండవచ్చునని భావిస్తున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting