ఆ కాన్సెప్ట్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుందా..?

Posted By: Super

ఆ కాన్సెప్ట్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుందా..?

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్‌జీ కొత్త ఫార్ములాతో ముందుకొచ్చింది. క్వర్టీ మోడల్ కీప్యాడ్‌తో కూడిన డ్యూయల్ సిమ్‌ఫోన్‌ను సంస్థ తాజాగా ప్రకటించింది. పేరు ఎల్‌‌జీ సీ199. మన్నికైన బ్యాటరీతో, సమర్థవంతమైన మొబైలింగ్ కమ్ మల్టీమీడియా అంశాలు ఈ ఫోన్‌లో ఒదిగి ఉన్నాయి.

92 గ్రాముల బరువు కలిగి 109.4 x 59.8 x 12.5మిల్లీ మీటర్ల పరిమాణం కలిగిన ఈ హ్యాండ్‌సెట్ సులువుగా జేబులో ఇముడుతుంది. 2.3 అంగుళాల స్ర్కీన్ , ఫోన్‌బుక్ సామర్ధ్యం 1000 ఎంట్రీలు, ఫోటో కాల్ ఫీచర్, ఇంటర్నల్ మెమెరీ 78.4ఎంబీ, మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమెరీని 8జీబికి పెంచుకోవచ్చు.

పొందుపరిచిన WAP, HTML బ్రౌజర్ల ద్వారా నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 2 మెగా పిక్సల్ కెమెరా 1600×1200 పిక్సల్ రిసల్యూషన్‌ను కలిగి ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తుంది. ఈ కెమెరా సాయంతో వీడియో షూటింగ్ నిర్వహించుకోవచ్చు.

ముందుగానే లోడ్ చేసిన ఆడియో, వీడియో ప్లేయర్ అప్లికేషన్‌లు మన్నికైన వినోదాన్ని చేరువచేస్తాయి. ఎఫ్ఎమ్ రేడియో ఫీచర్ మరో ప్రత్యేకత. ఏర్పాటు చేసిన WLAN, బ్లూటూత్ వంటి వైర్‌లెస్ కనెక్టువిటీ ఆప్షన్‌లు డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే అమర్చిన Li-Ion 1100 mAh బ్యాటరీ 475 గంటల స్టాండ్‌బై, 7 గంటల 30 నిమిషాలు టాక్‌టైమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. బ్లాక్ ఇంకా సిల్వర్ కలర్ వేరింయట్‌లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot