సింపుల్‌గా ఉంటుంది!!

Posted By: Prashanth

సింపుల్‌గా ఉంటుంది!!

 

విశ్వసనీయ బ్రాండ్ ఎల్‌జీ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సీ221 పేరుతో సరికొత్త స్లైడింగ్‌ ఫోన్‌ను ఈ దిగ్గజ బ్రాండ్ రూపొందించింది. సింపుల్ లుక్‌తో ఆకట్టకుంటున్న ఈ బడ్జెట్ ఫోన్ బ్లాక్ కలర్‌లో డిజైన్ కాబడింది.

కీలక ఫీచర్లు:

బరువు 96 గ్రాములు,

బ్యాటరీ టాక్‌టైమ్ 3 గంటలు,

స్టాండ్‌బై 12.5 రోజులు (దాదాపు 300 గంటలు).

ఫోన్‌లో అమర్చిన న్యూమరిక్ కీప్యాడ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు దోహదపడుతుంది. డి-ప్యాడ్‌ను ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌తో పొందవచ్చు. ఎల్‌సీడీ టెక్నాలజీతో కూడిన డిస్‌ప్లే వ్యవస్థను డివైజ్‌లో దోహదం చేశారు. నిక్షిప్తం చేసిన ఎంపీత్రీ మ్యూజిక్ ప్లేయర్ మన్నికైన సౌండ్ క్వాలిటీని ఉత్పత్తి చేస్తుంది. ఏర్పాటు చేసిన హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్ వ్యవస్థ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. ఫోన్‌బుక్‌లో 1000 ఎంట్రీల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చిన్నారులను ఆకర్షించే వినూత్న గేమింగ్ అప్లికేషన్‌లను హ్యాండ్ సెట్‌లో ఇన్‌బుల్ట్ చేశారు. బ్లూటూత్ కనెక్టువిటీ డేటాను వేగవంతంగా షేర్ చేస్తుంది.

నిరుత్సాహ పరిచే అంశాలు:

జీపీఎస్ వ్యవస్థ లోపించింది,

మెమరీని పెంచుకునేందుకు మైక్రోఎస్డీ స్లాట్ వ్యవస్థ లేదు,

3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ లోపించింది,

సాధారణ ఫీచర్లతో స్టైలిష్‌గా ఉంటే ఫోన్‌లను ఇష్టపడే వారి కోసం ఈ హ్యాండ్‌సెట్‌ను డిజైన్ చేసినట్లు ఎల్‌జీ వర్గాలు ప్రకటించాయి. బ్యాటరీ బ్యాకప్, స్లైడింగ్ మోడల్, న్యూమరిక్ కీప్యాడ్, ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి అంశాలు యువతను ప్రత్యేకంగా ఆకట్టకుంటాయి. సీ221 ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting