ఊదరగొడుతున్న పుకార్లు..?

ఎల్‌జీ ప్రవేశపెట్టబోతున్న ఓ ఫీచర్ ఫోన్‌కు సంబంధించి పుకార్లు ఊదరగొడతున్నాయి. ఎల్‌జీ కుకీ (LG Cookie)గా వస్తున్న ఈ హ్యాండ్‌సెట్‌కు చెందిన ఓ ఫోటో ఇప్పటికే ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తుంది. మార్కెట్ వర్గాల్లో అంచనాలు పెంచుతున్న ఈ డివైజ్ సంబంధించి పలు కీలక ఫీచర్లు బహిర్గతమయ్యాయి. వాటి వివరాలు...
- 3.2 అంగుళాల డిస్‌ప్లే, రిసల్యూషన్ (240X320 పిక్సల్స్).
- డ్యూయల్ సిమ్ సపోర్ట్,
- వై-ఫై,
- 2 మెగా పిక్సల్ కెమెరా,
- ట్రెండీ డిజైన్,
- జీఎస్ఎమ్, ఎడ్జ్ కనెక్టువిటీ,
- ఇన్-బుల్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్,
- మైక్రో ఎస్డీకార్డ్ స్లాట్,
- ధర అంచనా రూ.4,900.
‘మే’ ఫీవర్..!!!
రానున్న మే మరో బృహత్తర ఆవిష్కరణకు వేదిక కానుంది. అత్యధిక మంది వినియోగదారులచే నెంబర్1 బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎల్‌జీ ఓ హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కోడ్ నెం ‘D1L’. డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్, ఎల్‌టీఈ కనెక్టువిటీ వంటి పటిష్టమైన వ్యవస్థలను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు ఎల్‌జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా బహిర్గతమయ్యాయి. ఎల్‌జీ ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘ఆప్టిమస్ 4X HD’కి రానున్న ఫోన్ అప్‌డేటెడ్ వర్షన్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications