నిన్న డ్యూయల్ సిమ్, ఈరోజు డ్యూయల్ స్క్రీన్స్

By Super
|
LG Double Play
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ కొత్తగా మార్కెట్లోకి 'డ్యూయల్ స్క్రీన్ టెక్నాలజీ' స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేయనుంది. ఎల్‌జీ విడుదల చేయనున్న డ్యూయల్ స్క్రీన్ టెక్నాలజీ మొబైల్ ఫోన్ పేరు ఎల్‌జీ డబుల్ ప్లే. ఈ మొబైల్ కున్న మరో పేరే ఎల్‌జీ ఫ్లిప్ II. ఎల్‌జీ డబుల్ ప్లే స్మార్ట్ పోన్ గూగుల్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

చూడడానికి సింగిల్ మొబైల్ ఫోన్ మాదిరి ఉన్నప్పటికీ దీనిని స్లైడ్ చేసి చూస్తే మొబైల్ అభిమానులు ఈ మొబైల్ ఫోన్‌ని డిజైన్ చేసిన ఇంజనీర్స్‌కి వావ్ చెబుతారు. ఫోన్‌ని స్లైడ్ చేస్తే దీనియొక్క ప్రైమరీ స్క్రీన్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు స్క్రీన్ రిజల్యూషన్ 320 x 480 ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది. ఇక రెండవ స్క్రీన్ చిన్న సైజు క్వర్టీ కీప్యాడ్‌తో అలరిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే గతంలో నోకియా విడుదల చేసిన 'నోకియా ఎంగేజ్' మొబైల్ మాదిరే దీనియొక్క డిస్ ప్లే‌లు ఉంటాయి.

ఎల్‌జీ డబుల్ ప్లే స్మార్ట్ ఫోన్ బరువు 99గ్రాములు. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. మొబైల్ వెనుక భాగాన 5మెగా పిక్సల్ కెమెరా సహాయంతో చక్కని ఇమేజిలను మాత్రమే కాకుండా వీడియోని కూడా తీయవచ్చు. ఎల్‌ఈడి ప్లాష్ కెమెరా ప్రత్యేకం. డేటాని ఒక మొబైల్ నుండి మరో మొబైల్‌కి పంపేందుకు గాను బ్లూటూత్ అదనం. ఈ మొబైల్‌లో కమ్యూనికేషన్ టెక్నాలజీ వై-పై లేకపోవడం కొంత నిరాశ.

ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. Li-Ion బ్యాటర్ ఇందులో నిక్షిప్తం చేయడం వల్ల బ్యాటరీ బ్యాక్ అప్ విషయంలో కూడా యూజర్స్‌కు చక్కగా సహాకరిస్తుంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను సపోర్ట్ చేస్తుంది. ఎల్‌జీ డబుల్ ప్లే మొబైల్‌ని ఇండియాలో వచ్చే సంవత్సరం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇండియాలో దీని ధర సుమారుగా రూ 7,500గా ఉండొచ్చునని నిపుణుల అంచనా..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X