ఎల్‌జీ బేసిక్ మరో మోడల్ 'ఎల్‌జీ ఎక్స్‌ట్రావర్ట్'

Posted By: Super

ఎల్‌జీ బేసిక్ మరో మోడల్ 'ఎల్‌జీ ఎక్స్‌ట్రావర్ట్'

 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ రంగంలో నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న కంపెనీ ఎల్‌జీ. ఇండియాలో ఉన్న మద్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఎల్ జీ మార్కెట్లోకి ఓ సరిక్రొత్త మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనుంది. దాని పేరు 'ఎల్‌జీ ఎక్స్‌ట్రావర్ట్'. క్వర్టీ కీప్యాడ్‌తో స్పెషల్ స్లైడర్ డిజైన్ ఎల్‌జీ ఎక్స్‌ట్రావర్ట్ మొబైల్ ప్రత్యేకం. 2.8 ఇంచ్ స్క్రీన్‌ని కలిగి ఉండడమే కాకుండా, టిఎఫ్‌టి టెక్నాలజీని కలిగి ఉంది.

ఇందులో ఉన్న 2 మెగా ఫిక్సల్ కెమెరాతో ఇమేజిలను తీయడంతో పాటు, వీడియోని కూడా కస్టమర్స్ తీసుకొవచ్చు. డిజిటల్ జూమ్ ఫీచర్ కెమెరాకి ప్రత్యేకం. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. ఇంటర్నెట్ వినియోగం కొసం ఇందులో 'ఓపెరా బ్రౌజర్' ని ప్రత్యేకంగా నిక్షిప్తం చేయడం జరిగింది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ లను కూడా ఈ మొబైల్ ద్వారా యాక్సెస్ చేసుకొవచ్చు. ఎల్‌జీ ఎక్స్‌ట్రావర్ట్ మొబైల్ ప్రత్యేకతలు మరిన్ని క్లుప్తంగా...

'ఎల్‌జీ ఎక్స్‌ట్రావర్ట్' మొబైల్ ప్రత్యేకతలు:

హార్డ్‌వేర్

ఎత్తు     4.13 inches

వెడల్పు     2.09 inches

మందం     0.62 inches

బరువు     0.27 pounds

ఫామ్ ఫ్యాక్టర్     Slider

కలర్     Black / Red

కీప్యాడ్     QWERTY

డిస్ ప్లే

స్క్రీన్ సైజు (diagonal)     2.8 inches

టెక్నాలజీ     LCD

స్క్రీన్ రిజల్యూషన్:     400 px, 240 px

కనెక్టివిటీ

సిడిఎమ్ఎ:     Yes

బ్లూటూత్:     Yes

బ్లూటూత్ వర్సన్:     Bluetooth 3.0

స్టోరేజి

విస్తరించుకునే మెమరీ:     Yes, 32 GB,     microSD

కెమెరా

కెమెరా రిజల్యూషన్:     2 megapixels

వీడియో రిజల్యూషన్:     Custom

ఆడియో జాక్:     3.5mm

బ్యాటరీ: Quoted use time     350 min

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot