ఎల్‌జి మొదటి టచ్ అండ్ టైప్ పోన్ ఆప్టిమస్ ఫ్రో సి660

  By Super
  |

  ఎల్‌జి మొదటి టచ్ అండ్ టైప్ పోన్ ఆప్టిమస్ ఫ్రో సి660

   
  ఇండియన్ మొబైల్ మార్కెట్లో టచ్ అండ్ టైప్ మొబైల్ రావడం ఇదే మొట్టమొదటి సారి మాత్రం కాదు. చాలా మంది మొబైల్ తయారీదారులు ఈ స్ట్రాటజీని ఉపోయోగించి సక్సెస్‌ని పోందిని ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇలా టచ్ అండ్ టైప్ మొబైల్స్‌ని కంపెనీలు తయారు చేయడం వెనుక కస్టమర్స్‌ని ఆకర్షించుకునే ప్రయత్నంలో భాగమేనని నిపుణులు అంటున్నారు. మొబైల్ యూజర్లలలో కొంత మంది టచ్ కీప్యాడ్ ఉన్నప్పటికీ కూడా ఒరిజినల్ కీప్యాడ్‌నే ఉపయోగించడానికే ఇష్టపడతారు. అంతేకాకుండా అప్లికేషన్స్‌ని మెను ట్యాబ్స్, బటన్స్ ద్వారా టచ్ చేయడమే కాకుండా జాయ్ స్టిక్ ద్వారా హ్యాండిల్ చేయడానికి సుముఖత చూపిస్తారు.

  ఇలా రెండు టచ్ అండ్ టైప్ కోరుకునే వారికోసం ఎల్‌జి కంపెనీ నుండి మొట్టమొదటసారి టచ్ అండ్ టైప్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది. దానిపేరే ఎల్‌జి ఆప్టిమస్ ప్రో సి660. ఎల్‌జి దీని ద్వారా ప్రత్యర్ది కంపెనీలకు ఓ ఛాలెంజ్‌ని కూడా విసిరినట్లు ఉంటుందని అన్నారు. ఇక డిజైన్ విషయంలో ఎల్‌జి ఆప్టిమస్ ప్రో సి660 రఫ్‌గా కనిపిస్తుంది. మీ కళ్లకు చూడడానికి అందంగా కనిపించేందుకు వీలుగా ఎల్‌జి ఆప్టిమస్ ప్రో సి660 మొబైల్‌లో 2.8 ఇంచ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. ఎల్‌జి ఆప్టిమస్ ప్రో సి660 పవర్ పుల్ 800 MHz Qualcomm MSM 7227 ప్రాసెసర్‌ని కలిగి ఉండడంతో పాటు 512 MB RAMతో రన్ అవుతుంది. ఇందులో మల్టీ టాస్కింగ్ పనులు చాలా త్వరితగతిన అవుతాయి.

  నోకియా, శ్యామ్‌సంగ్, మోటరోలా కంపెనీల నుండి విడుదలైనటువంటి అదేరకమైన మొబైల్ పోన్లకు ఎల్‌జి ఆప్టిమస్ ప్రో సి660 చాలా గట్టి పోటీని అందిస్తుందని అంటున్నారు. ఎల్‌జి ఆప్టిమస్ ప్రో సి660 మల్టీమీడియో, ఎంటర్టెన్మెంట్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేయడంతో పాటు ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా అందిస్తుంది. వీటితోపాటు ఎఫ్‌ఎమ్ రేడియో, 3.5 mm ఆడియా జాక్ సౌండ్ కనెక్టివిటీ ప్రత్యేకం. ఎల్‌జి ఆప్టిమస్ ప్రో సి660 మొబైల్ వెనుక భాగాన విజిఎ కెమెరాని కలిగి ఉంది. వీడియో కాలింగ్ ఫెసిలిటీని సపోర్ట్ చేయడానికి ముందు భాగాన ఎటువంటి కెమెరా లేదు.

  ప్రస్తుతం మొబైల్ ఇండస్ట్రీలో కనెక్టివటీ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ లాంటి అన్నింటిని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు 2జి, 3జి ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రత్యేకం.

  The notable LG Optimus Pro features:

  Android Gingerbread OS
  3G
  Wi-Fi and Bluetooth
  Expandable memory of 32GB
  3 Mega Pixel camera
  Java

  ఎల్‌జి ఆప్టిమస్ ఫ్రో సి660 ఖరీదు సుమారుగా రూ 13000 వరకు ఉండవచ్చునని అంచనా. ఇక ఈ మొబైల్ ఇండియన్ మార్కెట్లో 2011చివరికల్లా విడుదలవుతుందని అభిప్రాయపడుతున్నారు.

  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more