LG Folder 2 ఫ్లిప్ ఫోన్: సరసమైన ధరలో గొప్ప ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్...
ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలలో ఒకటైన LG సంస్థ ఇప్పుడు కొత్తగా తన కొత్త ఫోల్డర్ 2 ఫ్లిప్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే కంపెనీ నుండి వస్తున్న ఈ సరికొత్త ఫోన్ కేవలం 4G సపోర్ట్‌తో మాత్రమే వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రెండు స్క్రీన్లను కలిగి ఉండడమే కాకుండా ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్‌లతో వస్తుంది.

LG ఫోల్డర్ 2
LG ఫోల్డర్ 2 ఫ్లిప్ ఫోన్ ప్రాథమికంగా బడ్జెట్ పరిమితులలో ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకున్నది. అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫ్లిప్ ఫోన్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

LG ఫోల్డర్ 2 ఫ్లిప్ ఫోన్ ధరల వివరాలు
LG ఫోల్డర్ 2 ఫ్లిప్ ఫోన్ ఫిబ్రవరి 2018 లో లాంచ్ అయిన ఎల్‌జి ఫోల్డర్ ఫోన్‌కు అప్ డేట్ వెర్షన్ గా విడుదల అయింది. ఈ ఫోన్ ప్లాటినం గ్రే మరియు వైట్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో విడుదల అయింది. ఈ ఫోన్ యొక్క ధరల విషయానికొస్తే ఎల్జీ ఫోల్డర్ 2 యొక్క ధర 198,000 WON. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు 12,400 రూపాయలు. కంపెనీ ఏప్రిల్ 17 నుండి ఈ హ్యాండ్‌సెట్‌ను అమ్మకానికి ఉంచింది.

LG ఫోల్డర్ 2 ఫ్లిప్ ఫోన్ స్పెసిఫికేషన్స్
ఎల్జీ ఫోల్డర్ 2 ఫ్లిప్ ఫోన్ 127 గ్రాముల బరువును కలిగి ఉండి రెండు డిస్‌ప్లేలతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క రెండు డిస్‌ప్లేలలో మొదటిది 2.8-అంగుళాల QVGA LCD ప్రైమరీ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. అలాగే 0.9-అంగుళాలు గల రెండవ స్క్రీన్ మోనోక్రోమ్ ప్యానల్‌తో వస్తుంది. ఇది మెసేజెస్ మరియు కాల్‌ల కోసం నోటిఫికేషన్‌లను ప్రదర్శిస్తుంది. ఈ ఫోన్ యొక్క వెనుక భాగంలో 2 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ జతచేయబడి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్‌తో రన్ అవుతూ 1,470mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

LG ఫోల్డర్ 2 ఫీచర్స్
ఎల్జీ ఫోల్డర్ 2 ఫ్లిప్ ఫోన్‌లో ఒక SOS కీ కూడా ఉంటుంది. ఈ కీని వినియోగదారులు మూడుసార్లు నొక్కడం ద్వారా అత్యవసర SMSను స్థాన సమాచారం వివరాలతో ముందే నమోదు చేయబడిన ఫోన్ నంబర్‌కు పంపడానికి సహాయపడుతుంది. ఎల్జీ ఫోల్డర్ 2 లో AI వాయిస్ సర్వీసును యాక్సెస్ చేయడానికి హాట్కీతో T9 కీప్యాడ్ ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఎల్జీ తన సరికొత్త ఫ్లిప్ ఫోన్‌ను 1 జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో విక్రయించనుంది. అధిక మెమొరీ విస్తరణ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications








