4జీ కనెక్టువిటీతో ఎల్‌జి జీ2 స్మార్ట్‌ఫోన్

Posted By:

ఎల్‌జి తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎల్‌జి జీ2ను శుక్రవారం బెంగుళూరు మార్కెట్లో విడుదల చేసింది. ఈ అధిక ముగింపు స్మార్ట్ మొబైల్ డివైస్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది. 16జీబి వేరియంట్ ధర రూ.46,000. 32జీబి వేరియంట్ ధర రూ.49,000. 4జీ సేవలు ఇప్పటికే బెంగుళూరులో అందుబాటులో ఉన్న నేపధ్యంలో ఎల్‌జి జీ2 స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఆశాజనకంగా సాగే అవకాశముంది. వేగవంతమైన మొబైల్ కమ్యూనికేషన్‌ను కోరుకునే బెంగుళూరు వాసులకు ఈ 4జీ ఫోన్ మంచి ఉపయోగకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బెంగుళూరు వాసులకు ఎల్‌జి జీ2 స్మార్ట్‌ఫోన్

ఎల్‌జి జీ2 ప్రధాన ఫీచర్లు:

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్), 423 పిక్సల్ పర్ ఇంచ్ (పీపీఐ), క్వాల్కమ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.26గిగాహెట్జ్), 2జీబి ర్యామ్, మొమరీ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో ), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్ట, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ పరిమాణం 138.5 x 70.9 x 8.9మిల్లీ మీటర్లు, బరువు 143 గ్రాములు, ఫోన్ కలర్ ఆప్షన్స్ బ్లాక్ , వైట్ గోల్డ్,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ హెచ్ పీఏ+ 42 ఎంబీపీఎస్, వై-ఫై 802.11 a/b/g/n, బ్లూటూత్ 4.0, ఏ2డీపీ, జీపీఎస్, ఏజీపీఎస్ కనెక్టువిటీ.

ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ఎయిర్‌టెల్ వినియోగదారులకు కంపెనీ రూ.3.000 విలువ చేసే ఎల్‌జి క్విక్ విండో కవర్‌ను ఉచితంగా అందిస్తోంది. ఎల్‌జి జీ2 4జీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ సందర్భంగా ఎల్ జి మొబైల్ ఇండియా మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజరాల్ మా ప్రతినిధితో ఆసక్తికర వివరాలను షేర్ చేసుకున్నారు. ఆ ముఖాముఖి సంభాషణలను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/JjZUkWMRNls?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot