Home
Mobile

భారత్‌లో ఎల్‌జీ జీ3 ఉపకరణాలు

ఈ వారం ఆరంభంలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ జీ3ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఎల్‌జీ ఇండియా బిగ్ బి సంతకంతో కూడిన 15,000 లిమిటెడ్ ఎడిషన్ ఎల్‌జీ జీ3 ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తామని, ఈ ఫోన్లను కొనుగోలు చేసిన కొద్ది మంది వినియోగదారులకు అమితాబ్ బచ్చన్‌ను కలుసుకునే అవకాశం ఉంటుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ సూన్ క్వాన్ తెలిపారు. ఎల్‌జీ జీ3 స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా జీ స్మార్ట్‌వాచ్‌ను ఎల్‌జీ విడుదల చేసింది.

భారత్‌లో ఎల్‌జీ జీ3 ఉపకరణాలు

ముంబై వేదికగా సాగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ రెండు డివైస్‌లతో పాటు ఎల్‌జీ ‘జీ3' స్మార్ట్‌ఫోన్‌ను సపోర్ట్ చేసే పలు ఉపకరణాలను ప్రదర్శించింది. వీటిలో క్విక్‌సర్కిల్ కేస్, టోనీ ఇన్ఫినిమ్ (బ్లూటూత్ హెడ్ సెట్), వైర్‌లెస్ చార్జింగ్ డాక్‌లు ఉన్నాయి. క్విక్ సర్కిల్ కేస్ (రూ.3,990), వైర్‍‌లెస్ చార్జింగ్ డాక్ (రూ.3,990) ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. టోనీ ఇన్ఫినిమ్ అందుబాటుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/MzRdoHptaKs? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్, 538 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్ (16జీబి మెమరీ వేరియంట్), 3జీబి ర్యామ్ (32జీబి మెమరీ వేరియంట్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

ఎల్‌జి ఆప్టిమస్ యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఓఐఎస్ ప్లస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్), 2.1 మెగా పిక్సల్ ఫ్ఱంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై 802.11 ఏబీజీఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, స్లిమ్ పోర్ట్, ఫోన్ బరువు 151 గ్రాములు, 3000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
LG G3 Accessories in India: QuickCircle Case, Tone Infinim, Wireless Charger Hands On [VIDEO]. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X