ఎల్‌జి జీ3 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం

Posted By:

 ఎల్‌జి జీ3 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం

2014, అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్న ఎల్‌జి జీ3 (LG G3) స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ప్రీఆర్డర్ పై లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ Infibeam ఈ స్మార్ట్ డివైస్ విక్రయాలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తోంది. 16 ఇంకా 32జీబి మెమెరీ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. 16జీబి వేరియంట్ ధర రూ.46,990. 32జీబి వేరియంట్ ధర రూ.54,999. డివైస్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి జూలై 25 తరువాత నుంచి డెలివరీ ఉంటుంది.

 ఎల్‌జి జీ3 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం

ఎల్‌జి జీ3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్, 538 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ 2.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 2జీబి లేదా 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 1వాట్ సామర్థ్యం గల శక్తివంతమైన స్పీకర్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ( లేజర్ ఆటో ఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా అడ్వాన్సుడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ తో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot