ఎల్‌జీ జీ3..తొలి చూపులోనే పడిపోతారు (వీడియో)
ఎల్‌జీ కంపెనీ తన లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ జీ3 (G3)ని సోమవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 16జీబి వర్షన్ ధర రూ.47,990. 32జీబి వర్షన్ ధర రూ.50,990. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బి సంతకంతో కూడిన 15,000 లిమిటెడ్ ఎడిషన్ ఎల్‌జీ జీ3 ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తామని, ఈ ఫోన్లను కొన్న కొద్ది మంది వినియోగదారులకు అమితాబ్ బచ్చన్‌ను కలుసుకునే అవకాశం ఉంటుందని ఫోన్ ఆవిష్కరణ సందర్భంగా ఎల్ జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ సూన్ క్వాన్ తెలిపారు. ఇదే కార్యక్రమంలో జీ స్మార్ట్‌వాచ్‌ను ఎల్‌జీ విడుదల చేసింది. ధర రూ.15,000. జీ3 ఫోన్‌తో కలిసి ఈ వాచ్‌ను కొనుగోలు చేస్తే రూ.5,000 రాయితీ అందిస్తామని, అంతేకాకుండా రూ.3,500 విలువ చేసే క్విక్ సర్కిల్ కేస్‌ను ఉచితంగా పొందటంతో పాటు రూ.6,500 విలువైన వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్ మెంట్ వర్తిస్తుందని సూన్ క్వాన్ తెలిపారు.

లేజర్ ఆటో ఫోకస్ కెమెరా, స్మార్ట్ కీబోర్డ్, స్మార్ట్ నోటీస్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఎల్‌జీ జీ3 ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్, 538 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8974ఏసీ) ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్ (16జీబి మెమరీ వేరియంట్), 3జీబి ర్యామ్ (32జీబి మెమరీ వేరియంట్), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.
ఎల్‌జి ఆప్టిమస్ యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఓఐఎస్ ప్లస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్, ఆటో ఫోకస్), 2.1 మెగా పిక్సల్ ఫ్ఱంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై 802.11 ఏబీజీఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, స్లిమ్ పోర్ట్, ఫోన్ బరువు 151 గ్రాములు, 3000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.
క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సౌకర్యం. ఫోన్ పోయినపుడు అది పనిచేయకుండా చేసే కిల్ స్విచ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్‌ను ఎల్‌జీ జీ3 ఫోన్‌లో ఏర్పాటు చేసారు.
ఎల్‌జీ జీ3 ఫస్ట్ లుక్ వీడియో
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/7KRygw80Rqo? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








