ఫోన్ ఒకటి, కెమెరాలు మూడు: దూసుకొస్తున్న ఎల్‌జీ జీ5

Written By:

స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం ఎల్ జీ నుంచి అదిరిపోయే ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఇప్పటిదాకా సింగిల్ కెమెరాతో అలరించిన ఎల్ జీ ఇప్పుడు డ్యూయల్ కెమెరాతో పాటు సెల్ఫీ కెమెరాతో కలిపి మొత్తం మూడు కెమెరాలతో మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. డ్యూయల్ కెమెరాలంటే ఓన్లీ వెనుకభాగంలోనే రెండు కెమెరాలు ఉంటాయి. వాటితో మనం వివిధ యాంగిల్లో ఫోటోలు తీసుకోవచ్చు. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016 లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: గెలాక్సీ ఎస్7 వచ్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జీ జీ 5 పేరుతో లాంచ్ చేసిన ఈ మొబైల్‌ను

ఎల్‌జీ జీ 5 పేరుతో లాంచ్ చేసిన ఈ మొబైల్‌ను మెటల్ బాడీతో డిజైన్ చేశారు. 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుంది. ఈ ఫోన్ కింది భాగాన్ని కొత్త హార్డ్‌వేర్‌తో స్వాప్ చేసుకునేందుకు వీలుంటుంది.

5.3 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే

5.3 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్ కలిగిన ఈ ఫోన్‌కు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ ను ప్రవేశపెట్టారు.

4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్

4 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ వంటి ఫీచర్లను జోడించారు.

4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్-సి

4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్-సి, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 4.2, వైఫై 802.11 ఏసీ లాంటి ఫీచర్లు ఉంటాయి.

16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు

16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి. అదిరే లుక్‌తో ఫోటోలు తీసుకోవచ్చు.

ముందు భాగంలో ఒక కెమెరాతోపాటు వెనుక రెండు కెమెరాలుం

ఈ ఫోన్‌కు ముందు భాగంలో ఒక కెమెరాతోపాటు వెనుకభాగంలో రెండు కెమెరాలుంటాయి. అందులో 78 డిగ్రీల స్టాండర్డ్ లెన్సు కలిగిన కెమెరా ద్వారా రెగ్యులర్ ఫోటోలు తీసుకోవచ్చు. మరో కెమెరాలో ఉండే 135 డిగ్రీల వైడర్ లెన్స్ సాయంతో ఉన్న చోటి నుంచే అధిక విస్తీర్ణాన్ని కవర్ చేస్తూ ఫొటో తీసేందుకు వీలుంటుంది.

భారీగా పొడవు లేదా వెడల్పుగా ఉండే భవంతులు

అంటే భారీగా పొడవు లేదా వెడల్పుగా ఉండే భవంతులు లేదా ఇతర నిర్మాణాలు, ఆకృతులను, పెద్దసంఖ్యలో ఉన్న జనసమూహాన్ని ఉన్న చోటి నుంచే ఫొటో తీసుకునేందుకు వీలవుతుంది.

ఈ మొబైల్ ధర ఎంతనే విషయాన్ని

ఈ మొబైల్ ధర ఎంతనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

rnrn

ఎల్‌జీ జీ 5 కి సంబంధించిన వీడియో ఇదే

ఎల్‌జీ జీ 5 కి సంబంధించిన వీడియో ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write LG G5 Top 5 Features: Modules, Dual Rear Cameras, and More
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot