12జీబి ర్యామ్, 10,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ...

స్మార్ట్‌ఫోన్‌ల మనందరి జీవితాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. వినియోగదారులు కొత్తదనంతో నిండిన స్మార్ట్‌ఫోన్‌లను కోరుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, ప్రతిరోజు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతూనే ఉన్నాయి.

12జీబి ర్యామ్, 10,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ...

యూజర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తోన్న పలు కంపెనీలు భిన్నమైన ప్రత్యేకతలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకురావటం మొదలుపెట్టాయి.ఈ మధ్య కాలంలో ఔరా..! అనిపించే స్పెసిఫికేషన్‌లతో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : 2016లో ఊరించి ఉసూరుమనిపించిన 5 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టురింగ్ ఫోన్

నోకియా గురించి మరో హాట్ న్యూస్

మొబైల్ ఫోన్‌ల తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న టురింగ్ రోబోటిక్స్ ఇండస్ట్రీస్ (టీఆర్ఐ) విప్లవాత్మక ఫీచర్లతో కూడిన ఓ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో అనౌన్స్ చేసింది. Cadenza పేరుతో ఆవిష్కరించబడిన ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు విశ్లేషకులను సైతం అవాక్కయ్యేలా చేస్తున్నాయి. 2017లో విడుదల కాబోతున్న ఈ ఫోన్ డీప్ లెర్నింగ్ క్యాపబులిటీతో కూడిన Swordfish OS పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన స్పెసిఫికేషన్‌లు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి...

శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 830 ప్రాసెసర్‌

టురింగ్ ఫోన్ Cadenzaలో రెండు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 830 ప్రాసెసర్‌లను నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. టురింగ్ రోబోటిక్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన సమచారం ప్రకారం Cadenza ఫోన్ 12జీబి ర్యామ్‌తో రాబోతోంది. ఎక్స్‌ప్యాండబుల్ ఆఫ్షన్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. 5.8 అంగుళాల డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్థ్యం (2560 x 1440పిక్సల్స్), కెమెరా విషయానికి వచ్చేసరికి Cadenza ఫోన్ 20 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో పాటు 60 మెగా పిక్సల్ ఐమాక్స్ 6కే క్వాడ్ రేర్ ఫేసింగ్ కెమెరా వింత్ ట్రైప్లెట్ లెన్స్‌తో వస్తోంది. ఇది నిజంగా అద్భుతం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకేసారి 8 నెట్‌వర్క్‌లను ఈ ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది...

లెనోవో ఫోన్‌లకు 4G VoLTE అప్‌డేట్, చెక్ చేసుకోండి

నానో సిమ్‌లను మాత్రమే సపోర్ట్ చేయగలిగే 4 డ్యుయల్ సిమ్ స్లాట్‌లను Cadenza ఫోన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంటే ఒకేసారి 8 నెట్‌వర్క్‌లను ఈ ఫోన్‌లో రన్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చేసిరికి ఈ భారీ డివైస్‌లో గ్రాఫేన్ సూపర్ కండక్టర్, లిథియం అయాన్ బ్యాటరీ, హైడ్రోజన్ ఇంధన సెల్ కలయకతో అభివృద్థి చేసిన 100 వాట్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఎల్‌జీ జీ5

ఎల్‌జీ కంపెనీ మాడ్యులర్ డిజైన్‌తో రూపొందించిన ఎల్‌జీ జీ5 ఫోన్, ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. సరికొత్త డ్యుయల్ కెమెరా సెటప్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రొఫెషనల్ క్వాలిటీ వైడ్ - యాంగిల్ ఫోటోగ్రఫీని యూజర్లకు చేరువ చేస్తుంది. 5.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ 3డీ ఆర్క్ గ్లాస్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే.. క్వాడ్ - కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.52,990.

Yaao 6000

Bluetooth కొత్త వర్షన్ స్పీడ్ ఎంతో తెలుసా..?

ఏకంగా 10,900mAh బ్యాటరీ కెసాపిటీతో వస్తోన్న Yaao 6000 ఫోన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. Yaao 6000 ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాడ్-కోర్ మీడియాటె్ ఎంటీ6735 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫోన్ ధర రూ.15,000 (అనధికారికంగా).

Lumigon T3

ప్రముఖ డానిష్ టెక్నాలజీ కంపెనీ లుమిగాన్, నైట్ విజన్ కెమెరా టెక్నాలజీతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. లుమిగాన్ టీ3 పేరుతో ఆవిష్కరించబడిన ఈ ఫోన్ కటిక చీకట్లోనూ క్లారిటీ ఫోటోలను చిత్రీకరిస్తుంది. ఈ పోన్ బేస్ మోడల్ ధర
925 డాలర్లు. మన కరెన్సీలో ఈ విలువ రూ.61,748. లుమిగాన్ ఈ ఫోన్‌ను 24 క్యారెట్ గోల్డ్ ఎడిషన్‌లో అందించే ప్రయత్నం చేస్తోంది. బ్లాక్ గోల్డ్ వేరియంట్ ధర 1200 డాలర్లు. మన కరెన్సీలో రూ.80,000. ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే..

లేటెస్ట్ స్మార్ట్‌వాచీ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇన్నోవేటివ్ డిజైన్‌..

నోకియా గురించి మరో హాట్ న్యూస్

లుమిగాన్ టీ3 ఫోన్ ప్రత్యేకమైన ఇన్నోవేటివ్ డిజైన్‌తో వస్తోంది. ఫోన్ లుక్ ఇంకా ఫీల్ కంఫర్ట్‌గా ఉంటుంది. బ్యాక్ టచ్, నైట్‌విజన్, 3డీ ఫింగర్ ప్రింట్, స్టీరియో స్పీకర్స్ వంటి విప్లవాత్మక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. మెరైన్ గోల్డ్ 316 స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి ప్రీమియమ్ స్థాయి లోహాలను ఉపయోగించి లుమిగాన్ టీ3 ఫోన్‌ను బిల్డ్ చేసారు. డిస్‌ప్లే మన్నికను రెట్టింపు చేసే క్రమంలో ఫైబర్ గ్లాస్, గొరిల్లా గ్లాస్ 4 వంటి దృఢమైన ప్రొటక్షన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. డస్ట్ ఇంకా వాటర్ రిసిస్టెంట్ ఫీచర్లు ప్రమాదాల నుంచి

ఫోన్‌ను కాపాడతాయి.

 

4 మెగా పిక్సల్ నైట్ విజన్ కెమెరా

లుమిగాన్ టీ3 ఫోన్ 4.8 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ సూపర్ అమోల్డ్ డైమండ్ డిస్‌ప్లేతో వస్తోంది. లుమిగాన్ టీ3 ఫోన్ వెనుక భాగంలో 4 మెగా పిక్సల్ నైట్ విజన్ కెమెరాను మనం చూడొచ్చు.ఈ కెమెరా వ్యవస్థలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఐఆర్ సెన్సార్లు చిమ్మ చీకట్లోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ ఇంకా వీడియో రికార్డింగ్‌ను అందిస్తాయి. ఫోన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన యాక్షన్ కీ ద్వారా నైట్ విజన్ కెమెరాను ఆపరేట్ చేయవచ్చు.

హైసెక్యూర్ వాల్ట్ ఫీచర్‌..

లుమిగాన్ టీ3 ఫోన్‌లో హైసెక్యూర్ వాల్ట్ ఫీచర్‌ను ఏర్పాటు చేసారు. ఈ వాల్ట్‌లో ఫోటోలు, కాంటాక్ట్స్, యాప్స్ ఇంకా డాక్యుమెంట్‌లను సేఫ్‌గా భద్రపరుచుకోవచ్చు. లుమిగాన్ టీ3 ఫోన్‌ను యూనివర్శల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ కండీషనర్, టీవీ, ఆడియో ఇంకా ఇతర గృహోపకరణాలను లుమిగాన్ టీ3 ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. లుమిగాన్ టీ3 ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

Cat S60

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

థర్మల్ పవర్ ఇమేజ్ రికార్డింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్ షాక్‌లను తట్టుకోగలదు. 5 మీటర్ల లోతైన నీటిలో పడినప్పటికి ఫోన్ చెక్కు చెదరదు, 6 అడుగుల ఎత్తునుంచి క్రిందపడినప్పటికి ఫోన్‌కు ఏమి కాదు. ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి... స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 5 Smartphones with Unique Features: 10,900mAh Battery, 12GB RAM, Night Camera, and More. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot