మళ్లీ ఆ ఫోన్‌పై రూ.9 వేలు కోత, మొత్తంగా రూ.19 వేలు కట్

Written By:

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఎల్‌జీ త‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జీ6'పై మరోసారి భారీ తగ్గింపు ప్రకటించింది. జీ6' ధరలో రూ. 9 వేలు కోత పెట్టింది. తాజా తగ్గింపుతో 'జీ6' స్మార్ట్‌ఫోన్‌ రూ.37,990కు భారత్‌లో ఈ ఫోన్ ను యూజర్లు సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌, నేరుగా దుకాణంలో కొన్నా తగ్గింపు వర్తిస్తుంది.అయితే అమెజాన్‌లో అస్ట్రో బ్లాక్‌, మిస్టిస్ వైట్‌ కలర్‌ ఫోన్లకు మాత్రమే తగ్గింపు ఉంటుంది. మూడో రకం ఐస్‌ ప్లాటినమ్‌ మోడల్‌ రూ.39,990కే లభ్యమవుతుంది. ఈ మేరకు రిటైలర్లకు ఎల్‌జీ సమాచారం అందించింది.

జియోకి ముంచుకొస్తున్న ప్రమాదం, ఆ రోజునే Airtel ఫోన్, ధర, ఫీచర్లు లీక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఏడాది ఫిబ్రవరిలో

కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో 'జీ6' స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. భారత మార్కెట్లో దీని ధరను రూ.51,999గా నిర్ణయించింది.

ఇంట్రస్ట్ చూపించకపోవడంతో

అయితే వినియోగదారులు ఈ ఫోన్ పై ఇంట్రస్ట్ చూపించకపోవడంతో భారీ తగ్గింపుతో అమెజాన్‌లో ప్రవేశపెట్టింది. రూ. 10 వేల డిస్కౌంట్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ కొనుగోలుదారుల కోసం రూ.13వేల వరకు పరిమిత కాలపు డిస్కౌంట్ కూడా ఇచ్చింది.

ప్రైమ్ మెంబర్లకు రూ.38,990కే

అప్పుడు ప్రైమ్ మెంబర్లకు రూ.38,990కే ఈ ఫోన్‌ లభ్యమయింది. అయినప్పటికీ అమ్మకాలు పెరగకపోవడంతో తాజాగా మరో రూ.9 వేలు తగ్గింపు ప్రకటించింది.

ఫీచర్ల విషయానికొస్తే

5.7 ఇంచ్ QHD+ పుల్ వర్షన్ డిస్‌ప్లే విత్ 18:9 (or 2:1) aspect ratio.మాములుగా ఇండస్ట్రీ స్టాండర్డ్ రేషియో 16.9 ఉంటుంది. దీని ద్వారా సినిమాలు, టీవీ, లాంటివి ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. డాల్బే విజన్ తో వచ్చిన మొదటి ఫోన్ కూడా ఇదే.

ర్యామ్

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 SoC విత్ 4GB of LPDDR, 4 ర్యామ్, 32/ 64 జిబి ఇంటర్నల్ స్టోరేజి, మైక్రో ఎస్ డీ ద్వారా 2 టిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం ఉంది.

కెమెరా

డ్యూయెల్ రేర్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ వెనకభాగంలో 13 ఎంపీ సెన్సార్ ని పొందుపరిచారు. ఒక కెమెరాతో వైడ్ యాంగిల్ షాట్స్ 125 డిగ్రీల కోణంలో తీయవచ్చు. మరొకటి రెగ్యలుర్ కెమెరా 7 డిగ్రీల కోణంలో ఫోటోలు తీసుకోవచ్చు. సెల్పీ అభిమానుల కోసం 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 3300mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ. క్విక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ను వెనుక భాగంలో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద రన్ అవుతుంది.

గూగుల్ అసిస్టెంట్

గూగుల్ ఫిక్సల్ ఫోన్ల తర్వాత గూగుల్ అసిస్టెంట్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే. ఫోన్ బరువు 163 గ్రాములు. డస్ట్ అండ్ వాటర్ రిసెస్టింట్ ఫీచర్ ఉంది. అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం, మిస్టిక్ వైట్ ఈ మూడు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG G6 gets another price cut; now selling for Rs 37,990 in India Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot