ఆ ఫోన్ విడుదల రేపే..
ఎల్‌జి నుంచి మార్కెట్లోకి ఓ సరికొత్త ఫోన్
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఎల్‌జి నుంచి మార్కెట్లోకి ఓ సరికొత్త ఫోన్ రానుంది. ఇప్పటికే పలు రకాల మోడల్స్ ను రిలీజ్ చేసిన ఎల్‌జి క్యూ6 పేరిట ఓసరికొత్త మొబైల్ ను లాంచ్ చేయనుంది.దీనికి ముహర్తం రేపు కానుంది. ఇప్పటికే దీని ఫీచర్లు గీక్ బెంచ్ లో హల్ చల్ చేశాయి కూడా. దీనికి సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

డిస్‌ప్లే
డిస్‌ప్లే ఎల్‌జీ క్యూ6 ఫోన్‌లో 5.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్.

ర్యామ్
3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1 నౌగట్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్

కెమెరా
13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు

3200 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉండనున్నాయి.

రాత్రి 9.30 గంటలకు
రేపు భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు పోలాండ్‌లో నిర్వహించనున్న ఓ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. దీని ధర వివరాలు అదే రోజున వెల్లడిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








