లీకయిన LG G7 ThinQ ఫీచర్లు , మరో సంచలన ఫోన్ అవుతుందా ?

|

LG తర్వాతి ఫ్లాగ్షిప్ ఫోన్ LG G7 ThinQ అన్ని హంగులతో మే 2 న విడుదలకు సిద్దంగా ఉంది. LG G7 ThinQ లాంచింగ్ కార్యక్రమానికి ప్రెస్ ఆహ్వానాలను పంపించడం ద్వారా, LG ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇప్పటికే LG G7 ThinQ సంబంధించి బయటకు వచ్చిన అనేక పుకార్ల ప్రకారం, మొబైల్ ఎలా ఉండనుందో ఇప్పటికే ఒక ఖచ్చితమైన అవగాహన అందరిలో వచ్చింది. కానీ LG G7 ThinQ లాంచింగ్ కొన్నిరోజుల్లో ఉండగా , సీరియల్ లీక్స్టర్ గా పేరు పొందిన ఇవాన్ బ్లాస్ తన ట్విట్టర్ అకౌంట్ లో తాజాగా మొబైల్ సంబంధించి కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. వారం క్రితం విడుదల చేసిన ఫోటోల కంటే భిన్నంగా అన్ని రకాల కోణాలలో LG G7 ThinQ మొబైల్ సoబంధించిన ఫోటోలను పోస్ట్ చేసారు. ఈ ఫోటోలను చూస్తుంటే ఫుల్ స్క్రీన్ డిజైన్ తో Iphone - X లోని నాచ్ వంటి ఫీచర్లతో ఫ్లాగ్షిప్ ఫోన్లకు ధీటైన పోటీ ఇచ్చేలా కనిపిస్తూ ఉంది అనడంలో ఆశ్చర్యమే లేదు. ఫోటోల పై ఒక లుక్కేయండి.

 

56 రోజుల పాటు జియో 112 జిబి డేటా ఉచితం, ఎలా పొందాలో తెలుసుకోండి56 రోజుల పాటు జియో 112 జిబి డేటా ఉచితం, ఎలా పొందాలో తెలుసుకోండి

 రక్షణ కవచం

రక్షణ కవచం

సెల్ఫీ కెమెరా కి ఒక రక్షణ కవచంలా ఈ నాచ్ ఉండనుంది. ఆమ్బియంట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ తో ఇన్ - కాల్ స్పీకర్ కూడా ఈ నాచ్ భాగంలో ఉండనున్నాయి. మరియు క్రింది బెజెల్ ప్రాంతం ఎంటువంటి అదనపు ఫీచర్లను కలిగి లేదు. కానీ, మిగిలిన బెజెల్స్ కన్నా క్రింది బెజెల్ సాంద్రత ఎక్కువగా మందంగా ఉండనుందని తెలుస్తుంది.

మొబైల్ వెనుక భాగంలో

మొబైల్ వెనుక భాగంలో

మొబైల్ వెనుక భాగంలో డ్యూయల్ కెమరా నిలువుగా మొబైల్ పై భాగాన మద్యలో పొందుపరచబడి ఉంది. మరియు కెమరా ఎడమ వైపున LED ఫ్లాష్, కెమెరా కింది భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు g7 ThinQ లోగో ఉండనుంది.

ప్రత్యేకంగా బటన్
 

ప్రత్యేకంగా బటన్

ఫోన్ పైభాగాన సిమ్ ట్రే, క్రింది భాగాన ౩.5 mm హెడ్ఫోన్స్ జాక్, USB-C (టైప్ C ) పోర్ట్ మరియు ఎక్స్టర్నల్ స్పీకర్ ఉండనుందని తెలుస్తుంది. కొన్ని మొబైల్స్ లో మ్యూజిక్ కోసం, లేదా పవర్ సేవర్ కోసం ప్రత్యేకంగా బటన్ కేటాయించడం జరుగుతుంది, అదేవిధంగా LG G7 ThinQ లో గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేకంగా ఒక బటన్ కేటాయించారు. వాల్యూం కంట్రోల్స్ బటన్స్ కూడా గూగుల్ అసిస్టెంట్ పై భాగాన నిక్షిప్తమై ఉండనున్నాయి. మరియు కుడిపక్కన పవర్ బటన్ ఉండనుంది.

స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ..

స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ..

స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే LG G7 ThinQ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ కలిగి, 6 GB రామ్, 64GB అంతర్గత మెమరీ తో ఉండనున్నట్లు అంచనాలు ఉన్నా, మరికొన్ని స్టోరేజ్ వేరియంట్లలో కూడా రానుందని అనేక ఇంటర్నెట్ నివేదికల సమాచారం.

16 మెగా పిక్సెల్ సెన్సార్లు

16 మెగా పిక్సెల్ సెన్సార్లు

ఈ స్మార్ట్ ఫోన్ లో రేర్ సైడ్ రెండు 16 మెగా పిక్సెల్ సెన్సార్లు కలిగి, ఒకటి RGB లెన్స్ తో f/1.6 ఆపర్చర్ సైజ్ కలిగి, రెండవ సెన్సార్ 107 డిగ్రీల వైడ్ ఆంగిల్ లెన్స్ కలిగి ఉండనుంది. తద్వారా కెమరా డిపార్ట్మెంట్ భారీగానే అంచనాలను పెంచిందని చెప్పవచ్చు. LG నుంచి వచ్చిన మరొక ఫోన్ V30S వలె ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సపోర్ట్ చేస్తూ ఫ్లాగ్ షిప్ ఫోన్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.

"సూపర్ పిక్సెల్" అనే ఫీచర్

అంతేకాకుండా కెమెరా ఫ్రేం లోని వివిధ అంశాలని విశ్లేషించి, వివిధ వర్గాల మధ్య సరైన షూటింగ్ మోడ్ను సిఫారసు చేయగలదు. LG చెప్పిన ప్రకారం, "సూపర్ పిక్సెల్" అనే ఫీచర్ ను జోడించడం ద్వారా తక్కువ వెలుతురులో కూడా మంచి సామర్ధ్యం కలిగిన ఫోటోలను తీసే వెసులుబాటు ఉంటుంది. పూర్తీ వివరాలు తెలియాలంటే మే 2 వరకు ఆగాల్సిందే మరి.

Best Mobiles in India

English summary
LG G7 ThinQ leaked render shows iPhone X-like notch, dual rear cameras More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X