అంతర్జాతీయ మార్కెట్లోకి ఎల్‌జి జీఎక్స్

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఎల్‌జి ‘జీఎక్స్’ పేరుతో సరికొత్త పెద్దతెర స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఎల్‌జి జీ ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌కు దగ్గర పోలికను కలిగి ఉండే ఈ హ్యాండ్‌సెట్ మెరుగుపరచబడిన యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంకా సరికొత్త డిజైనింగ్‌ను కలిగి ఉంది.

 అంతర్జాతీయ మార్కెట్లోకి ఎల్‌జి జీఎక్స్

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే:

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,  క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగెన్ 600 సీపీయూ,  2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,  32జీబి ఇంటర్నల్ మెమెరీ,  3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ,  ఫోన్ పరిమాణం150.6×76.1×9.2మిల్లీ మీటర్లు,
ఫోన్ బరువు 167 గ్రాములు.

కనెక్టువిటీ ఫీచర్లు: ఎల్టీఈ, హెచ్ఎస్‌పీఏ, ఈవీ-డీవో, వోల్టీ(యూ+), 2.6గిగాహెట్జ్ బ్రాండ్ బ్యాండ్ ఎల్టీఈ సపోర్ట్, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ). ప్రీలోడెడ్ సాఫ్ట్‌వేర్‌లు: స్మార్ట్‌డే, మీడియా టైమ్, స్మార్ట్ మెమో, యూ+ నావీ, క్యూరిమోట్

ఎల్‌జి ‘జీఎక్స్' స్మార్ట్ హ్యాండ్‌సెట్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి  తెలుగు గిజ్‌బాట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot