లోగుట్టు... తెలుసుకోండి!!

Posted By: Prashanth

లోగుట్టు... తెలుసుకోండి!!

 

ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన మొబైల్ హ్యాండ్సెట్లను డిజైన్ చెయ్యటంలో ఎల్‌జీ ఉత్తమ బ్రాండ్. తాజాగా ఈ దిగ్గజం అత్యున్నతమైన సాంకేతిక విలువలతో కూడిన వన్ టచ్ ఫీచర్ ఫోన్‌ను వృద్ధి చేసింది. పేరు ఎల్‌జీ GX500. అత్యాధునిక టెక్నికల్ స్పెసిఫికేషన్‌లతో పాటు సరికొత్త సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను ఈ స్మార్ట్‌ మొబైల్‌లో నిక్షిప్తం చేశారు.

ఫోన్ మరిన్ని ఫీచర్లు:

- 3 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా (ఫోటోలతో పాటు వీడియోలను షూట్ చేసుకోవచ్చు),

- హై స్పీడ్ నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకునేందుకు ఓపెరా మినీ బ్రౌజర్ వర్షన్ 5.0 ఏర్పాటు,

- డ్యూయల్ సిమ్,

- సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించే సౌలభ్యత,

- వై-ఫై కనెక్టువిటీ,

- 7.62 సెంటీమీటర్ల టచ్‌స్ర్కీన్ (ఏ-క్లాస్ యూజర్ ఇంటర్ ఫేస్)

టెక్నికల్ స్పెసిఫికేషన్‌లు:

- ప్రీలోడెడ్ ఎంపీత్రీ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, రికార్డర్,

- ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్,

- ట్రై బ్యాండ్ ఇంకా క్వాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ సపోర్ట్,

- పొందుపరిచిన 1500mAh సామర్ధ్యం గల బ్యాటరీ 15 గంటల టాక్‌టైమ్, 572 గంటల స్టాండ్ బై నిస్తుంది.

- ఇంటర్నల్ మెమరీ 40ఎంబీ,

- మైక్రో‌ఎస్డీ కార్డ్ ద్వారా మెమరీని 16జీబికి పెంచుకోవచ్చు.

- బ్లూటూత్ కనెక్టువిటీ.

అత్యుత్తమ మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ అనుభూతులను చేరువ చేసే ఈ స్మార్ట్ మొబైల్ విలువ రూ.9990. త్వరపడండి మరి!!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot