ఐడియా కొట్టు... లక్ష పట్టు!

మొబైల్ టెక్నాలజీ రంగంలో క్రీయాశీలక పాత్రపోషిస్తూ భారతీయుల సుపరిచత బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్‌ఫోన్ ఐడియా క్యాంప్ పేరుతో వినూత్న ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. వినియోగదారుతో మమేకమయ్యే సదుద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభను ప్రోత్సాహించే ప్రయత్నానికి ఎల్‌జీ శ్రీకారం చుట్టింది. రెండు నెలల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్‌జీ ఇండియా ప్రతిభగల వారికి అవకాశం కల్పించనుంది.
ఈ పోటీలో పాలుపంచుకునే ఔత్సాహికులు కొత్తదనం నిండిన అప్లికేషన్, ఫీచర్, కాన్సెప్ట్, సర్వీస్, డిజైన్, యూజర్ ఇంటర్ ఫేస్ (యూఐ) తదితర అంశాలను www.lg.com/in/smartphoneideacamp.jsp ద్వారా ఎల్‌జీతో షేర్ చేసుకోవచ్చు.
వీటిలో ఉత్తమమైన వాటిపి ఎంపిక చేసిన వాటిని ఎల్‌జీ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో పొందుపరచటంతో పాటు రూ.15లక్షల నగదు బహుమతిని అందించనున్నారు. వినియోగదారుల్లోని సృజనాత్మకతతో పాటు ప్రతిభను వెలికితీసే క్రమంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎల్‌జీ ఇండియా మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ హెడ్ సంజయ్ మహేశ్వరీ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టంబర్ 15తో ఈ ప్రచారం కార్యక్రమం ముగుస్తోంది.


Click it and Unblock the Notifications








