2000జీబి స్టోరేజ్ కెపాసిటీతో ఎల్‌జీ ఫోన్, రూ.13,990కే
బ్లాక్, గోల్డ్ అలానే టైటానియమ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఎల్‌జీ తన 'కె' సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఎల్‌జీ కే10 పేరుతో లాంచ్ అయిన విడుదలైన ఈ ఫోన్ ధర రూ.13,990. ఆఫ్‌లైన్ మార్కెట్లో ఫిబ్రవరి 23 నుంచి, ఆన్‌లైన్ మార్కెట్లో ఫిబ్రవరి 26 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. బ్లాక్, గోల్డ్ అలానే టైటానియమ్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
Read More : రూ.99తో 2018 వరకు జియో ఉచితం

LG K10 (2017) స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...
5.3 అంగుళాల అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ ఆర్క్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.5GHz ఆక్టా కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,800mAh రిమూవబుల్ బ్యాటరీ, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్.
భవిష్యత్ వర్చువల్ రియాల్టీదే..!

నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ను అత్యవసర సమయాల్లో సెక్యూరిటీ గాడ్జెట్‌లా ఉపయోగించుకోవచ్చు. ఫోన్ పవర్ బటన్‌ను మూడు సార్లు ప్రెస్ చేయటం ద్వారా 112 నెంబర్‌కు ఎమర్జెన్సీ కాల్ వెళుతుంది. వెంటనే రక్షక సిబ్బంది స్పందించటం జరుగుతుంది.


Click it and Unblock the Notifications