ఎల్‌జి K7iతో దోమలు పరార్, లెక్కపెట్టీ మరీ చంపుతుంది !

Written By:

దోమలకు మనిషి రక్తానికి దేవుడు చాలా దగ్గర సంబందం పెట్టాడు. అందుకే మనుషులు ఎక్కడుంటే.. అవి అక్కడే ఉంటాయి. దోమ చాలా చిన్నది .. కానీ మనిషి దోమలకు భయపడి.. దోమతెరలు, దోమల బ్యాడ్లు, గుడ్ నైట్స్ , ఇలా రకరకాల వస్తులను రక్షణగా వాడుతుంటారు. కానీ ఇక నుండి వాటికి మరిచిపోండి. ఎందుకంటే ఎల్‌జి ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో దోమల్ని చంపేసే ఫోన్ ని లాంచ్ చేసింది. దానిపేరే LG K7i. ఫోన్ టెక్నాలజీపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

రెడ్‌మి ఫోన్లపై రూ. 2 వేలు తగ్గింపు, షియోమి భారీ డిస్కౌంట్లు వీటిపైనే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మస్కిటో అవే టెక్నాలజీ'తో

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తొలిసారి ‘మస్కిటో అవే టెక్నాలజీ'తో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ దగ్గర ఉంటే మీ దరిదాపుల్లోకి దోమలు రావు. ఈ విచిత్రమైన స్మార్ట్‌ఫోన్‌ను న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఎల్జీ విడుదల చేసింది.

సౌండ్‌వేవ్ టెక్నాలజీ

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న సౌండ్‌వేవ్ టెక్నాలజీ దోమలను తరిమేస్తుంది. అయితే ఈ ఆల్ట్రాసోనిక్ డివైజ్ వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగదని ఎల్జీ వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగానే ఇది ఆల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుందని చెప్పింది.

ఈ ఫోన్ ఎలాంటి శబ్దాన్ని కానీ, దుర్వాసనను కానీ..

దీంతో పాటు ఈ మస్కిటో అవే టెక్నాలజీ వల్ల మన నిద్రకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఎందుకంటే ఈ ఫోన్ ఎలాంటి శబ్దాన్ని కానీ, దుర్వాసనను కానీ విడుదల చేయదు.

దీన్ని రీఫిల్లింగ్ కానీ, రీప్లేస్ కానీ చేయనవసరం లేదని..

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ప్రమాదకర కెమికల్స్ వాడలేదని ఎల్జీ వెల్లడించింది. అంతేకాకుండా దీన్ని రీఫిల్లింగ్ కానీ, రీప్లేస్ కానీ చేయనవసరం లేదని హామీ ఇచ్చింది.

ఎల్జీ కె7ఐ స్పెసిఫికేషన్లు

5 అంగుళాల ఆన్-సెల్ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ , 2జీబీ ర్యామ్, 16జీబీ మెమొరీ , 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఫ్లాష్‌తో కూడిన 8ఎంపీ వెనుక కెమెరా
సెల్ఫీల కోసం 5ఎంపీ ఫ్రంట్ షూటర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్
2500 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, వైఫై, బ్లూటూత్ 4.1

కంపెనీ ఇప్పటికే పలు టీవీలు, ఏసీలలో ఈ టెక్నాలజీని

ఈ ఫోన్లో 5 అంగుళాల డిస్‌ప్లే, 2,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది. కాగా కంపెనీ ఇప్పటికే పలు టీవీలు, ఏసీలలో ఈ టెక్నాలజీని పొందుపరిచింది.

ధర రూ.7,990

ఎల్జీ కె7ఐ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,990.అన్నీ రీటెయిల్ స్టోర్లలో లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG K7i: Meet the World's First Smartphone that Repels Mosquitoes Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot