దోమల్ని తరిమేసే స్మార్ట్‌ఫోన్ రూ. 7,990కే

దోమలను తరమడానికి జెట్‌ కాయిల్స్‌ను, బాడ్మింటన్‌ రాకెట్స్‌ను ఉపయోగించి ఉంటాం. కానీ ఇప్పుడు దోమలకు తరిమేసే స్మార్ట్‌ఫోన్లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి.

By Hazarath
|

దోమలను తరమడానికి జెట్‌ కాయిల్స్‌ను, బాడ్మింటన్‌ రాకెట్స్‌ను ఉపయోగించి ఉంటాం. కానీ ఇప్పుడు దోమలకు తరిమేసే స్మార్ట్‌ఫోన్లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. ప్రముఖ మొబైల్‌ హ్యాడ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ఎల్‌జీ తాజాగా ఇలాంటి ఫీచర్‌తో 'కే7ఐ' అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

ఇకపై హార్ట్‌తోనే మీ ఫోన్ లాక్ చేయవచ్చు, తీయవచ్చుఇకపై హార్ట్‌తోనే మీ ఫోన్ లాక్ చేయవచ్చు, తీయవచ్చు

LG K7i

దీని ధర రూ.7,990. మస్కిటో అవే టెక్నాలజీతో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో మస్కిటో అవే అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఫోన్ వెనుక భాగంలో అమర్చిన ప్రత్యేక ప్యానెల్ నుంచి అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ వస్తాయి.

ఐఫోన్ 8 , 8 ప్లస్ లాంచ్ చేసే ఛాన్స్ ఎవరికో తెలుసా..?ఐఫోన్ 8 , 8 ప్లస్ లాంచ్ చేసే ఛాన్స్ ఎవరికో తెలుసా..?

LG K7i

అవి దోమలను తరిమేస్తాయి. అయితే ఈ తరంగాలు మానవులకు మాత్రం హాని చేయవని ఎల్‌జీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ ఫోన్లో 5 అంగుళాల డిస్‌ప్లే, 2,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది. కాగా కంపెనీ ఇప్పటికే పలు టీవీలు, ఏసీలలో ఈ టెక్నాలజీని పొందుపరిచింది.

జియోఫోన్ రూ.1000 నష్టం వెనుక ఉచిత దోపిడి, అంబాని వ్యాపార తెలివి ఇదే !జియోఫోన్ రూ.1000 నష్టం వెనుక ఉచిత దోపిడి, అంబాని వ్యాపార తెలివి ఇదే !

LG K7i

ఎల్‌జీ కే7ఐ ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
LG K7i with ‘Mosquito away’ tech launched in India at Rs 7,990 Rea more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X