ఎల్‌జి నుంచి అదిరే ఫీచర్లతో LG K8 , K10 !

Written By:

త్వరలో జరగనున్న MWC 2018లో దక్షిణకొరియా దిగ్గజం ఎల్‌జి తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు LG K8, LG K10లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మిడ్ రేంజ్ మార్కెట్లో సత్తా చాటేందుకు ఎల్‌జి ఈ ఫోన్లను లాంచ్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి. లాంచ్ అయిన తరువాత ఈ ఫోన్ల అమ్మకాలు Europe, Asia, Latin America and the Middle East వంటి దేశాలలో జరిగే అవకాశం ఉంది. కాగా ఈ ఫోన్ల ఫీచర్లు, దీనికి సంబంధించిన ధరలు Mobile World Congressలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. కాగా ఈ ఈవెంట్ బార్సిలోనియాలో జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ ఫోన్ల ఫీచర్లు ఈ కింది విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఐడియా దూకుడు,రూ. 2 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్, పేమెంట్ బ్యాంకు షురూ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జీ కె8 (2018) ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఎల్‌జీ కె10 (2018) ఫీచర్లు

5.3 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఎల్‌జీ కె8 2017 ఫీచర్లు

కాగా గతేడాది లాంచ్ చేసిన ఎల్‌జీ కె8 అమెజాన్లో రూ.8138 ధరతో ట్యాగ్ అవుతోంది.
ఎల్‌జీ కె8 2017 ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఎల్‌జీ వీ30 ఫీచ‌ర్లు

ఈ ఫోన్‌తో పాటు ఎల్‌జీ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'వీ30'ని కూడా గతేడాది లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ఫోన్ వ‌రుస‌గా రూ.53,880, రూ.56,690 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు లభ్యం అవుతోంది.
ఎల్‌జీ వీ30 ఫీచ‌ర్లు
6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, 16, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్‌.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG K8 , K10 (2018) mid-end smartphones launched ahead of MWC 2018 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot