ఎల్‌జి ఎల్70 డ్యుయల్@రూ.15,000
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఎల్‌జి తన ఎల్ సిరీస్ నుంచి ఎల్70 డ్యుయల్ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.15,000. ఎల్‌జి తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పోన్‌కు సంబంధించిన వివరాలను పొందుపరిచింది.
మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎల్‌జి ఎల్70 డ్యుయల్ ఫోన్ ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. డ్యుయల్ సిమ్ జీఎస్ఎమ్ కనెక్టువిటీ. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే....

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 400 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications