ఎల్‌జీ ఎల్ బెల్లో@రూ.18,500
ఎల్‌జీ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇటీవల పొందుపరిచన మధ్య ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘ఎల్‌జీ ఎల్ బెల్లో'ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. ధర రూ.18,500. వైట్, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మరికొద్ది రోజుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుంది.

ఎల్‌జీ ఎల్ బెల్లో కీలక స్పెసిఫికేషన్‌లు:
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ),
ఫోన్ పరిమాణం 138.2x 70.6x 10.7మిల్లీ మీటర్లు,
2540 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








