సామాన్యుని నేస్తం ‘ఎల్ జీ A190’..!!

Posted By: Staff

సామాన్యుని నేస్తం ‘ఎల్ జీ A190’..!!

సాంకేతికత ఎదిగిన స్థాయికి సామాన్యుని కోనుగోలు స్థాయి ఎదగలేదు.. మార్కెట్‌కి ఎన్ని మెడళ్ల ఫోన్లు వచ్చిపడుతున్నా.., తెలుసుకోవటం తప్ప వాటిని కోనుగోలు చేసే సామర్ధ్యం సాధారణ ప్రజానికానికి లేదు.., తక్కువ ధరతో.. ఎక్కువ మన్నికను అత్యధిక శాతం మంది ఆశిస్తున్నారు. మొబైల్ వ్యవస్థను సామన్య, మధ్యతరగతి ప్రజానికానికి మరింత చేరువ చసే క్రమంలో ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్ ఎల్ జీ ( LG ), ‘LG, A190’ పేరుతో మొబైల్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది.

కేవలం రూ.1399కే లభ్యమయ్యే ఈ సరికొత్త ఎల్‌జీ హ్యాండ్ సెట్ అదనపు ఫీచర్లతో పాటు మన్నికైన బ్యాటరీ వ్యవస్థ కలిగి ఉంది. ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే, ఎల్‌జీ బ్యాటరీ వ్యవస్థ వినియోగదారునికి నిరంతరాయం లేని నెటవర్క్‌ను అందిస్తుంది. సామాన్యుని ‘సమాచార సాధనం’గా మార్కెట్లో విడుదలైన ఈ మొబైల్, ఇండియన్ మార్కెట్లో సంచలన అమ్మకాలు సృష్టిస్తుందని విశ్లేషక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అత్యంత స్వల్పంగా 72 గ్రాముల బరువు కలిగిన ఎల్‌జీ A190, 106.5 X 45 X 13.75 mm డైమెన్షన్ కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే Li ion 950m Ah సామర్ధ్యం గల వ్యవస్థలు బ్యాటరీలో పొందుపరిచారు. ఇక డిస్ ప్లే విషయానికి వస్తే 1.52 అంగుళాల స్ర్కీన్‌తో 65K TFT స్వభావం కలిగి ఉంటుంది.

2జీ వ్యవస్థను సపోర్ట్ చేసే ఎల్‌జీ A190లో కెమెరా సదుపాయం లేదు. పొందుపరిచిన జీపీఆర్‌ఎస్ (GPRS) కనెక్టీవిటీ వ్యవస్థతో మొబైల్‌ను కంప్యూటర్‌కు అనుసంధానం చేసుకుని నెట్ సర్ఫింగ్ చేసుకోవచ్చు. తక్కువ ధరతో లభ్యమవుతున్న ‘ఎల్ జీ A190’ని సామాన్య మధ్యతరగతి ప్రజులు ఏ మేరకు స్వాగతిస్తారో చూద్దాం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot