ఎల్‌జీ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు జావా ఆపరేటింగ్ సిస్టంతో.!

Posted By: Prashanth

ఎల్‌జీ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు జావా ఆపరేటింగ్ సిస్టంతో.!

 

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఎల్‌జీ తాను నూతనంగా డిజైన్ చేసిన రెండు స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఎల్‌జీ టీ375, టీ385 మోడల్స్‌లో రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్‌సెట్‌లు జావా ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తాయి. వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు సహకరించే 3జీ, వై-ఫై వ్యవస్థలను ఈ పరికరాల్లో ఏర్పాటు చేశారు. ఈ రెండింటిలో టీ375 డ్యూయల్ సిమ్‌ఫోన్ కాగా టీ385 సింగిల్ సిమ్‌ఫోన్. మార్చిలో ఈ ఫోన్‌లు విడుదల కానున్నాయి. మరిన్ని ఫీచర్లు...

* ఆకర్షణీయమైన స్లిమ్ డిజైన్,

* 3.2 అంగుళాల QVGA టచ్ స్ర్కీన్,

* కెమెరా విత్ 2మెగా పిక్సల్ సెన్సార్,

* 3జీ, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్,

* ముందుగానే పలు సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌ను లోడ్ ఫోన్‌లలో లోడ్ చేశారు,

* మ్యూజిక్ ప్లేయర్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

* మెమరీని 16జీబి వరకు పొడిగించుకునే వెసలుబాటు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot