మెరుపు వేగంతో రానున్న ఎల్‌జీ ఆప్టిమస్ నోట్

Posted By: Staff

మెరుపు వేగంతో రానున్న ఎల్‌జీ ఆప్టిమస్ నోట్

మొబైల్ మార్కెట్లో శ్యామ్‌సంగ్ గెలాక్సీ, ఎల్‌జీ ఆప్టిమస్, బ్లాక్‌బెర్రీ బోల్డ్ ఈ సిరస్‌లకు సంబంధించిన మొబైల్స్‌కు ఎల్లప్పుడూ మంచి గిరాకీ. అందుకు కారణం ఆయా కంపెనీలు ఈ సిరిస్‌లకు సంబంధించిన మొబైల్ ఫోన్లను అత్యాధునిక ఫీచర్స్‌తో విడుదల చేయడం ఒక ఎత్తు ఐతే, మార్కెట్లో కస్టమర్స్ యొక్క మనసు దొచుకోవడం మరోక ఎత్తు. అందుకే కాబోలు ఈ బ్రాండ్‌ని క్యాష్ చేసుకునందుకు గాను ఎల్‌జీ కంపెనీ మార్కెట్లోకి ఆప్టిమస్ సిరిస్ క్రింద మరో కొత్త స్మార్ట్ పోన్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దాని పేరే ఎల్‌జీ ఆప్టిమస్ నోట్.

కొరియన్ వెబ్ సైట్‌లో వెలువడిన సమాచారం మేరకు ఎల్‌జీ ఆప్టిమస్ నోట్ స్లైడ్ అవుట్ కీబోర్డ్‌ని కలిగి ఉందని సమాచారం. అంతేకాకుండా డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో పాటు, అండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ వర్సన్ 2.3.4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.గతంలో విడుదల చేసిన ఆప్టిమస్ సిరిస్ మొబైల్స్‌లతో పోల్చితే ఆప్టిమస్ నోట్ వేరే ఎల్‌సిడి డిస్ ప్లే స్క్రీన్‌ని కలిగి ఉంది. దాని పేరే నోవా. ఇక స్క్రీన్ సైజు రిజల్యూషన్ 800x480 ఫిక్సల్‌గా రూపోందించడం జరిగింది.ఫెర్పామెన్స్ విషయానికి వస్తే ఇందులో 1.2 GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

ఎల్‌జీ ఆప్టిమస్ నోట్ మొబైల్ వెనుక భాగంలో 5 మెగా ఫిక్సల్ కెమెరాని అమర్చడం జరిగింది. దీని సహాయంతో చూడచక్కని ఇమేజిలను తీయవచ్చు.ప్రస్తుతం మార్కెట్లో విడులవుతున్న అన్ని రకాల స్మార్ట్ ఫోన్లలలో ముందు భాగంలో కూడా కెమెరా ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఎల్‌జీ ఆప్టిమస్ నోట్ ముందు బాగంలో విజిఎ కెమరాని అమర్చడం జరిగింది. దీని సహాయంతో వీడియో కాలింగ్ కాల్స్‌ని అందుబాటులోకి తీసుకొనిరావచ్చు. వెనుక భాగాన ఉన్న కెమెరాలో ఫ్లాష్, జూమ్ లాంటి ఫీచర్స్ ప్రత్యేకం.

మొబైల్‌తో పాటు 8జిబి ఇంటర్నల్ మొమొరీ లభించగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని విస్తరించుకునే వెసులుబాటు కూడా ఉంది. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయంలో బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తుంది. ఎల్‌జీ కంపెనీ కొత్తగా విడుదల చేస్తున్న ఈ ఆప్టిమస్ సిరిస్ ద్వారా హై స్పీడ్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. వీటితో పాటు SMS/MMS support, FM radio, call logging, record and play, multiple audio లాంటి ఫీచర్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను కూడా సపోర్ట్ చేస్తుంది. జిపిఎస్ అప్లికేషన్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.

మొట్టమొదటి సౌత్ కోరియాలో విడుదల చేసి, ఆతర్వాత ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ని విడుదల చేయనున్నారని సమాచారం.ఎల్‌జీ ఆప్టిమస్ మొబైల్ ధరని మార్కెట్లో ఇంకా వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot