ఆ స్టోరీ లైన్ బయటకు వచ్చిందా!!

Posted By: Prashanth

ఆ స్టోరీ లైన్ బయటకు వచ్చిందా!!

 

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్ జీ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న ‘లూసిడ్ 4జీ’ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు బహిర్గతమయ్యాయి. 4జీ ఎల్ టీఈ వ్యవస్థను సపోర్ట్ చేసే ఈ అధునాత స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. హ్యాండ్ సెట్ లో నిక్షిప్తం చేసిన హై డెఫినిషన్ కెమెరా, 4జీ ఎల్ టీఈ కనెక్టువిటీలు ఆశాజనకమైన పనితీరును కనబరుస్తాయి. ఫోన్ ఇతర అంశాలను పరిశీలిస్తే.........

4 అంగుళాల పరిమాణంతో కూడిన మల్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800), 1200 మెగాహెడ్జ్ సామర్ధ్యం గల డ్యూయల్ కోర్ ప్రాసెసర్, గుగూల్ ఆండ్రాయిడ్ 2.3.6 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ హై డెఫినిషన్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ కెమెరా (ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ కోసం), వీడియోలను రికార్డ్ చేసుకునే సౌలభ్యత, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, ఫోన్ కనెక్టువిటీని వేగవంతం చేస క్రమంలో 3జీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఎస్ వ్యవస్థల ఏర్పాటు. దోహదం చేసిన ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో అప్లికేషన్ లు ఫోన్ ఎంటర్ టైన్ మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

నిక్షిప్తం చేసిన మరిన్ని అదనపు ఫీచర్లు:

* 700 MHz Class 13 LTE

* 800, 1900 MHz CDMA

* Built-in online services support

* Flash LED

* IMAP, POP3, SMTP, Microsoft Exchange

* Instant Messaging

* Light sensor

* 7.5 GB ROM capacity

* OTA Software updates

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot