పబ్లిసిటీ అదిరింది... విడుదల ఎప్పుడు..?

By Super
|
LG Marquee LS855 and Samsung Transform M930 Ultra


2011 స్మార్ట్ ఫోన్ సెక్టార్‌లో రెండు అంతర్జాతీయ ఉత్పాదక సంస్థలు విజయాల పరంపరను కొనసాగించాయి. ఈ రెండింటిలో ఒకటి ఎల్‌జీ కాగా మరొకటి శామ్‌సంగ్. ఏడాది ముగింపు నాటికి ఈ జాతీయ బ్రాండ్‌లు నూతన హ్యాండ్ సెట్ల ఆవిష్కరణకు సంబంధించి అధికారిక ప్రకటనలను జారీ చేశాయి.

 

‘మార్క్యు ఎల్ఎస్855’(Marquee LS855) మోడల్‌లో ఎల్‌జీ ఓ స్మార్ట్ మొబైల్‌ను ప్రవేశపెడుతుంటే. ‘ట్రాన్స్‌ఫార్మ్ ఎమ్930 అల్ర్టా’ (Transform M930 Ultra) వేరియంట్‌లో శామ్‌సంగ్ స్మార్ట్ డివైజ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

 

సీడీఎమ్ఏ (CDMA) నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఈ హ్యాండ్ సెట్‌లకు సంబంధించి విడుదల తేదీ ఖరారు కాక ముందే మార్కెట్ అంచనాలు జోరందుకున్నాయి. బలమైన ప్రత్యుర్థులుగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఎల్‌జీ, శామ్‌సంగ్‌లు మరో సారి ఢీ కొనబోతున్నాయి.

‘ఎల్‌జీ మార్క్యు ఎల్ఎస్ 855’ఫీచర్లు:

* 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ సామర్ద్యం గల టచ్ డిస్‌ప్లే, * 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * ఫోన్ బుక్ మెమెరీ అన్ లిమిటెడ్, * ఇంటర్నల్ మెమరీ 4జీబి, * ర్యామ్ 512 ఎంబీ, * ఎక్స్‌టర్నల్ మెమరీ 2జీబి, * ఎక్స్‌ప్యాండ్‌బుల్ విధానం ద్వారా మెమరీ శాతాన్ని 32కు పెంచుకోవచ్చు, * సీడీఎమ్ఏ నెట్‌వర్క్ సపోర్ట్, * 3జీ కనెక్టువిటీ, * WLAN,* బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ, * జీపీఎస్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, * బ్యాటరీ టాక్ టైమ్ 6 గంటల 30 నిమిషాలు, * ఆండ్రాయిడ్ v2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1 GHz ప్రాసెసర్, * అడోబ్ ఫ్లాష్ హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్.

శామ్‌సంగ్ ట్రాన్స్‌ఫార్మ్ ఎమ్930 అల్ర్టా ఫీచర్లు:

* 3.5 అంగుళాల టీఎఫ్టీ సామర్ధ్యం గల మల్టీ టచ్ డిస్‌ప్లే, * క్వర్టీ కీప్యాడ్, * 3.15 మెగా పిక్సల్ రేర్ కెమరా (ఎల్‌ఈడీ ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా, * అన్ లిమిటెడ్ ఫోన్‌బుక్, * ర్యామ్ 952 ఎంబీ, * ఎక్స్‌టర్నల్ మెమరీ 2జీబి, * మైక్రోఎస్టీ ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా జీబీని 32కు పెంచుకోవచ్చు, * సీడీఎమ్ఏ నెట్‌వర్క్ సపోర్ట్, * 3జీ కనెక్టువిటీ, * WLAN,* బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ, * జీపీఎస్ సపోర్ట్, * ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్, * బ్యాటరీ టాక్ టైమ్ 7 గంటలు, * ఆండ్రాయిడ్ v2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 1 GHz స్కార్పియన్ ప్రాసెసర్, * అడోబ్ ఫ్లాష్ హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్.

వీటి ధరల వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X