గూగుల్ బ్రాండెడ్ ఫోన్ ‘నెక్సస్4’ను ఇండియన్ మార్కెట్లో జనవరి నుంచి విక్రయించేందుకు ఎల్‌జి సన్నాహాలు చేస్తున్నట్లు ఐబీఎన్ తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. నెక్సస్4 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఆప్టిమస్ జీ మోడల్‌ను కూడా మార్కెట్లో విడుదల చేసేందుకు ఎల్‌జి సుముఖంగా ఉన్నట్టు పబ్లికేషన్ పేర్కొంది. ఈ ఆవిష్కరణల పై స్పందించేందుకు ఎల్‌జీ వర్గాలు నిరాకరించాయని సదరు ఆన్‌లైన్ పోర్టల్ తెలిపింది. అయితే, ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే.ఇన్ ( eBay.in) నెక్సస్4 విక్రయాలకు సంబంధించిన వివరాలను ఇప్పటికే తన లిస్టింగ్స్‌లో ఉంచింది. ఈ రిటైలర్ నెక్సస్4, 8జీబి వేరియంట్‌ను రూ.25,990కు, 16జీబి వేరియంట్‌ను రూ.29,990కు ఆఫర్ చేస్తోంది.
ఎల్‌జి నెక్సస్ 4 స్పెసిఫికేషన్‌లు:
బరువు ఇంకా చుట్టుకొలత: 134.2 x 68.6 x 9.1మిల్లీ మీటర్లు, బరువు 139 గ్రాములు.