ఎల్‌జీ కొత్త ప్రాజెక్ట్ విశేషాలు!

Posted By: Super

ఎల్‌జీ కొత్త ప్రాజెక్ట్ విశేషాలు!

ఉపయుక్తమైన యూజర్ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను సమకూర్చే అంతర్జాతీయ బ్రాండ్ ఎల్‌జీ తరువాతి ప్రాజెక్టుగా అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేస్తోంది. పేరు ‘ఎల్‌జీ మోషన్ 4జీ ఎమ్ఎస్770’. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 4జీ ఎల్‌టీఈ వంటి అత్యాధునిక ఫీచర్లను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ధర ఇతర అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫోన్ కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్,

క్వాల్కమ్ ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ శక్తివంతమైన కెమెరా,

వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ.

ఎల్‌జీ తొలి క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్ ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డి ఫీచర్లు:

డిస్‌ప్లే 4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్ , ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, యూఎల్‌పీ జీఫోర్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎన్-విడియా టెగ్రా3 చిప్‌సెట్, ఫ్రంట్ కెమెరా 1.3మెగా పిక్సల్, రేర్ కెమెరా 8 మెగాపిక్సల్, వీడియో రికార్డింగ్, జియో ట్యాగింగ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి, 1జీబి ర్యామ్, ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్, బ్రౌజర్( ఆడోబ్ ప్లాష్, హెచ్‌టిఎమ్ఎల్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, 2140ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర అంచనా రూ.20,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot