మార్కెట్లో 'ఎల్‌జీ మైటచ్ మోడల్స్' హాల్ చల్..

Posted By: Staff

మార్కెట్లో 'ఎల్‌జీ మైటచ్ మోడల్స్' హాల్ చల్..

ఇండియన్ మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్ హావా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎల్‌జీ మొబైల్ కంపెనీ కొత్తగా రెండు ఎల్‌జీ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసింది. వాటి పేర్లు 'ఎల్‌జీ మైటచ్', 'ఎల్‌జీ మైటచ్ క్యూ'. రెండు మొబైల్ ఫోన్స్ కూడా ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయి. 'ఎల్‌జీ మైటచ్' మొబైల్ టచ్ స్క్రీన్ ఫోన్ కాగా, 'ఎల్‌జీ మైటచ్ క్యూ' మొబైల్ స్లైడింగ్ ఫీచర్‌తో పాటు క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉంది. ఈ రెండు మొబైల్స్ నవంబర్ నెలలో అమెరికాలో విడుదల కానున్నాయి.,

'ఎల్‌జీ మైటచ్', 'ఎల్‌జీ మైటచ్ క్యూ' మొబైల్స్ స్లిమ్ డిజైన్‌తో కస్టమర్స్‌ని ఆకర్షించేలా తయారు చేయబడ్డాయి. మొబైల్ స్క్రీన్స్‌పై ప్రత్యేకంగా అప్లికేషన్ లాంఛర్, జీనియస్ బటన్ అమర్చడం జరిగింది. వీటి వల్ల యూజర్స్ స్మార్ట్ ఫోన్‌ని ఈజీగా అర్దం చేసుకొగలుగుతారు. ఎంటర్టెన్మెంట్ పీచర్స్‌తో పాటు, జిపిఎస్ మొదలగునవి ఫీచర్స్ ప్రత్యేకం. ఎల్‌జీ మైటచ్ స్మార్ట్ ఫోన్స్ రెండూ కూడా 1 GHz క్వాలికామ్ MSM8255 స్కార్పియన్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

మై టచ్ క్యూ మొబైల్ ఫోన్‌లో 5 మెగా ఫిక్సల్ కెమెరా ఉండడంతో ఫోటోలు, 720పి ఫార్మెట్లో వీడియో రికార్డింగ్‌ని తీయవచ్చు. కెమెరాకి ఎల్‌ఈడి ప్లాష్, ఆటో ఫోకస్ ప్రత్యేకం. ఇక మైటచ్ మొబైల్ ఫోన్ విషయానికి వస్తే కెమెరా, వీడియో రికార్డింగ్‌ని ప్లాష్ లేకుండా సపోర్ట్ చేస్తుంది. మొబైల్స్‌తో పాటు ఇంటర్నల్‌గా 512MB RAM, 2GB ROMమెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

ఎల్‌జీ మైటచ్ స్మార్ట్ ఫోన్‌లో పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను 1500 mAh Li-ion బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఎల్‌జీ మైటచ్ మొబైల్ టాక్ టైమ్ 3.3 గంటలు. అదే మైటచ్ క్యూ మొబైల్ విషయానికి వస్తే టాక్ టైమ్ 4.02గంటలు. ఎల్‌జీ మైటచ్, ఎల్‌జీ మైటచ్ క్యూ మొబైల్ రెండూ కూడా 4జీ నెట్ వర్క్‌ని సపోర్ట్ చేస్తాయి. త్వరలో అమెరికాలో విడుదల కానున్న ఈ రెండు మొబైల్ ఫోన్స్ ధరలను ఇంకా మార్కెట్లోకి ప్రవేశపెట్ట లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot