ఎల్‌జీ మరో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ యునివా

Posted By: Staff

ఎల్‌జీ మరో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ యునివా

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఆండ్రాయిడ్ ఫోన్లదే హావా అనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఆసియా మార్కెట్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తున్నటువంటి నోకియా, శ్యామ్ సంగ్, ఎల్ జీ మద్య ఉన్న కాంపిటేషన్లో ఎల్‌జీ ఆండ్రాయిడ్ మొబైల్ పోన్స్ సేల్స్ ఇటీనలే కొంత పేవలంగా ఉన్నట్లు సమాచారం. ఎల్‌జీ కంపెనీ త్వరలో ఆప్టిమస్ సిరస్ క్రింద విడుదల చేయనున్న ఎల్‌జీ ఆప్టిమస్ యునివా మొబైల్ గురించిన సమాచారం తెలుసుకుందాం.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కలగ జేసేందుకుగాను ఎల్‌జీ ఆప్టిమస్ యునిమా స్క్రీన్ సైజు 3.5 మెగా ఫిక్సల్‌గా రూపోందించడం జరిగింది. ఈ మొబైల్‌లో మల్టీ టాస్కింగ్ పనులు చాలా వేగవంతంగా చేసేందుకు గాను ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ అపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. మెను, పేజీలలోకి ఈజీగా వెళ్లేందుకుగాను మొబైల్‌లో చక్కని ఐకాన్స్‌ని పోందుపరచడం జరిగింది. ఎల్‌జీ ఆప్టిమస్ యునివా ప్రస్తుతం మోడ్రన్ సోసైటీలో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్ల(MP3, MP4, WMV, WAV, AAC+)ను సపోర్ట్ చేస్తుంది. హై డెఫినేషన్ వీడియో ఫార్మెట్లు అయినటువంటి h263, h264లను కూడా ఎల్‌జీ ఆప్టిమస్ యునివా సపోర్ట్ చేస్తుంది.

అంతేకాకుండా ఈ మొబైల్‌తో పాటు ఎఫ్ ఎమ్ రేడియో, 3.5 mm యూనివర్సల్ ఆడియో జాక్ ప్రత్యేకం. ఎల్‌జీ ఆప్టిమస్ యునివాలో యూజర్స్‌కు చక్కని ఇమేజీలు, వీడియో ఎక్స్ పీరియన్స్‌ని అందించే విషయంలో 5 మెగా ఫిక్సల్ కెమెరాని పోందుపరచడం జరిగింది. ఇక హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 720p ఫార్మెట్లో సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌ వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేయదు. అందుకు కారణం మొబైల్ ముందు భాగాన ఎటువంటి కెమెరా లేకపోవడమే. ఇక మొబైల్ తో పాటు ఇంటర్నల్‌గా మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉండే మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది.

ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయినటువంటి బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ మొదలగున వాటన్నింటిని సపోర్ట్ చేస్తుంది. వీటితోపాటు 2జీ ఇంటర్నెట్ టెక్నాలజీలు అయిన జిపిఆర్‌ఎస్, ఎడ్జి లను కూడా సపోర్ట్ చేస్తుంది. నావగేషన్ కోసం ప్రత్యేకంగా ఇందులో GPS moduleని అమర్చడం జరిగింది.

LG Optimus Univa features:

Android OS
5 Mega Pixel camera
Java
3G, Wi-Fi
Multi format music and video player
3.5 mm audio jack
GPS with AGPS

చివరగా ఎల్‌జీ ఆప్టిమస్ యునివాకు సంబంధించిన ధరను ఇంకా మార్కెట్లోకి వెల్లడించలేదు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting