ప్రీ ఆర్డర్‌కు ఎల్‌జీ నెక్సస్ 4!

Posted By: Super

 ప్రీ ఆర్డర్‌కు ఎల్‌జీ నెక్సస్ 4!

 

ప్రతిష్టాత్మక గూగుల్ స్మార్ట్‌ఫోన్  ‘ఎల్‌జీ నెక్సస్ 4’ను అక్టోబర్ 29న నాటకీయ పరిణామాల మధ్య  ఆన్‌లైన్ ద్వారా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. యూఎస్, యూకే, కెనాడా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఈ డివైజ్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నవంబర్ 13 నుంచి  లభ్యం కానుంది. అయితే ఇండియన్ మార్కెట్లో  ఈ స్మార్ట్‌ఫోన్  విడుదలకు సంబంధించి  ఖచ్చితమైన సమాచారం లేదు. నవంబర్ చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్న తరుణంలో ఆండ్రాయిడ్ అభిమానులను ఉత్సాహపరుస్తూ ప్రముఖ ఈ-కామర్స్ సైట్  ఈబే.ఇన్ (eBay.in), 8జీబి, 16జీబి

వేరియంట్‌లతో కూడిన ఎల్‌జీ నెక్సస్ 4 స్మార్ట్‌ఫోన్‌లను ప్రీఆర్డర్‌లకు ఉంచింది. వీటి ధరలను రూ.23,490, రూ.27,490గా పేర్కొంది.

ఎల్‌జీ నెక్సస్ 4 స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,

రిసల్యూషన్  1280 x 768పిక్సల్స్(జీరో గ్యాప్ టెక్నాలజీ),

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్-కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి,16జీబి,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

వైర్‌లెస్ చార్జింగ్,

వై-ఫై,

బ్లూటూత్,

2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (15.3గంటల టాక్‌టైమ్, 390 గంటల స్టాండ్‌బై),

(ప్రత్యేక ఫీచర్లు:  ఫోటో స్పియర్ కెమెరా, గెస్ట్యర్ టైపింగ్, మిరాకాస్ట్, డేడ్రీమ్, మెరుగుపరచబడిన నోటిఫికేషన్స్, వేగవంతమైన సెట్టింగ్స్, మల్టీపుల్ యూజర్ ఆకౌంట్ సపోర్ట్.)

మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ధరలు, హాట్‌డీల్స్ కోసం goProbo.comను సంప్రదించగలరు.

 

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot