నవంబర్ 30న ఇండియాలో ‘ఎల్‌జీ నెక్సస్ 4’!

Posted By: Prashanth

నవంబర్ 30న ఇండియాలో ‘ఎల్‌జీ నెక్సస్ 4’!

 

ఇప్పటికే యూఎస్, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇంకా స్పెయిన్ ప్రాంతాల్లో విడుదలై హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న గూగుల్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ నెక్సస్ 4 ఇండియాలో విడుదలకు సంబంధించి కీలక సమాచారాన్ని ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ (Saholic) తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 4 ఫోటోలను సదురు రిటైలర్ అప్‌లోడ్ చేసింది. అంతేకాదండోయ్! ‘ఎల్‌జీ నెక్సస్ 4’ 16జీబి వర్షన్ అందుబాటుకు సంబంధించిన వివరాలను ఈ సైట్ తన లిస్టింగ్స్‌లో చేర్చింది. విక్రయాలను నవంబర్30 నుంచి ప్రారంభమవుతాయని స్టేటస్ బార్‌లో పేర్కొంది.

గూగుల్ నెక్సస్ 4 ఫీచర్లు:

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్ (జిరోగ్యాప్ టెక్నాలజీ),

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాడ్-కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

2జీబి ర్యామ్,

ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి,16జీబి,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్,

వై-ఫై,

బ్లూటూత్,

2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (టాక్‌టైమ్ 15.3 గంటలు, స్టాండ్‌బై 390 గంటలు),

అదనపు ఫీచర్లు: ఫోటో స్పియర్ కెమెరా, గెస్ట్యర్ టైపింగ్, మిరాకాస్ట్, డేడ్రీమ్, మెరుగుపరచబడిన నోటిఫికేషన్స్, క్విక్ సెట్టింగ్స్, మల్టీపుల్ యూజర్ అకౌంట్స్).

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot